బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరగనుంది. ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు సభలో పాల్గొంటారు. షాతో పాటు కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. ఈ వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ఉదయం 8 గంటల 45 నిమిషాలకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో.. నిర్వహించే హైదరాబాద్ విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొంటారు. ఏడు కేంద్ర బలగాల కవాతు, గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఉదయం 11 గంటల 10 నిమిషాలకు బేగంపేటలోని హరిత ప్లాజాకు వెళతారు. అక్కడ బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమవుతారు. అనంతరం ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు.. పార్టీ బలోపేతం.. తెలంగాణ విమోచన వేడుకలపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాలకు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అమిత్ షా. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లి అక్కడ అధికారిక కార్యక్రమానికి హాజరవుతారు. ఇక రాత్రి తిరిగి 7.35కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీకి పయనమవుతారు.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా గన్ పార్క్ దగ్గర లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు., కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో.. బీజేపీ రాజ్య సభ సభ్యులు లక్ష్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యే రఘునందన్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Nora Fatehi: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. నటి నోరా ఫతేహికి క్లీన్‌చిట్