తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ మ.2గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. అనంతరం దివంగత కృష్ణంరాజు కుటుంబీకులకు పరామర్శించనున్నారు. అనంతరం ఫిల్మ్ నగర్ లో సంస్మరణ సభలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. తిరిగి సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఈరోజు రాత్రికి అమిత్ షా..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శుక్రవారం రాత్రి 9 గంటలకు 50 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నేషనల్ పోలీస్ అకాడమీకి బయలుదేరుతారు. అమిత్ షా రాత్రి అక్కడే బస చేసి, 17న ఉదయం 8.45కు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో.. నిర్వహించే హైదరాబాద్ విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొంటారు. ఏడు కేంద్ర బలగాల కవాతు, గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఉదయం 11 గంటల 10 నిమిషాలకు బేగంపేటలోని హరిత ప్లాజాకు వెళతారు. అక్కడ బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమవుతారు. అనంతరం ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు.. పార్టీ బలోపేతం.. తెలంగాణ విమోచన వేడుకలపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాలకు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అమిత్ షా. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లి అక్కడ అధికారిక కార్యక్రమానికి హాజరవుతారు. ఇక రాత్రి తిరిగి 7.35కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీకి పయనమవుతారు.
Meena Birthday Special : వైవిధ్యంగా సాగిన మీనా!