ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే కప్పలకు పెళ్లి చేయడం, విందు భోజనం ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. ఇక, వర్షాల కోసం వరుణయాగం, కబడ్డీ ఆటలు, పాటలు పాడటం చేస్తారు. తాజాగా అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో ఆదర్శ గోరెహగి గ్రామంలోని స్థానికులు వరుణ దేవుడి కటాక్షాన్ని పొందడానికి పురాతన మార్గాలను ఆశ్రయించారు.