వయ్యారాల కియారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండంటే రెండు తెలుగు సినిమాల్లో కనిపించినా, కుర్రకారు రెండు కళ్ళ నిండా నిలచిపోయింది అందాల భామ కియారా అద్వాణీ. అమ్మడి అందం చూసి కొందరు యంగ్ హేమామాలిని అన్నారు. మరికొందరు, సైరాబానును గుర్తు తెచ్చిందీ అని చెప్పారు. ఎవరు ఎలా పోల్చినా, కియారా అద్వాణీ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’లో కియారా అభినయం చూసిన యువకులెవ్వరూ ఆమెను మరచిపోలేరు. ఆ చిత్రంలోని కియారా అందాన్ని తలచుకుంటే చాలు కుర్రాళ్ళలో విద్యుత్ ప్రవహించవలసిందే! ఒకవేళ కరెంట్ అంతగా లేనివారికి సైతం కియారా అందాన్ని స్మరిస్తే చాలు ఉరకలు వేయక మానరు. అంతలా అలరించిన కియారా ‘కబీర్ సింగ్’తో కుర్రకారు మనసులను మరింతగా దోచుకుంది. ఈ అమ్మడి అందాల అభినయం కోసం బాలీవుడ్ పరుగులు తీస్తోంది. కియారా మాత్రం తనకు నచ్చిన చిత్రాలనే ఎంపిక చేసుకుంటూ సాగుతోంది.
కియారా అసలు పేరు అలియా అద్వాణీ. అప్పటికే చిత్రసీమలో అలియా భట్ ఉండడం వల్ల ఓ సారి సల్మాన్ ఖాన్ సూచనతో పేరు మార్చుకుంది. ఇక ‘కియారా’ పేరు పెట్టుకోవడానికీ ఓ కథ ఉంది. ‘అంజానా అంజానీ’ చిత్రంలో ప్రియాంక చోప్రా కేరెక్టర్ పేరు కియారా. ఆ సినిమా చూశాక ఆ పేరు నచ్చడంతో అలియాను తీసేసి ‘కియారా’ను తగిలించుకున్నానని అంటోంది అమ్మడు. కబీర్ సదానంద్ తెరకెక్కించిన ‘ఫగ్లీ’ చిత్రం ద్వారా కియారా పరిచయం అయింది. తరువాత ‘ఎమ్.ఎస్.ధోనీ’ చిత్రంలో హీరో భార్యగా నటించి ఆకట్టుకుంది. ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు జనం ముందు నిలచింది కియారా. వస్తూనే మహేశ్ బాబు వంటి టాప్ స్టార్ మూవీలో నటించడం వల్ల కియారాకు తెలుగునాట మంచి గుర్తింపు లభించింది. అది విడుదలయిన కొద్ది రోజులకే ‘లస్ట్ స్టోరీస్’లో కియారా కిర్రెక్కించింది. దాంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ‘వినయ విధేయ రామా’లో రామ్ చరణ్ కు జోడీగా నటించింది. ఈ సినిమాలోనూ అమ్మడి అందం అదరహో అనిపించింది. తెలుగులో విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’లో కియారా అందాల అభినయం అందరినీ అలరించింది. దాంతో కియారా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించేసింది. నెట్ ఫ్లిక్స్ ‘గిల్టీ’లోనూ కియారా ఆకట్టుకొనే నటనను ప్రదర్శించింది. అవకాశాలు వెల్లువెత్తుతున్నా కియారా ఎందుకనో ఆచి తూచి అడుగులేస్తూ తన మనసుకు నచ్చిన చిత్రాలనే ఎంపిక చేసుకుంటోంది.
Also Read
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి కియారా నటించిన ‘షేర్ షా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘భూల్ భులయ్యా -2’, ‘జగ్ జఘ్ జియో’ , ‘మిస్టర్ లేలే’ చిత్రాలలో నటిస్తోంది. ‘షేర్ షా’ హీరో సిద్ధార్థ్ మల్‌హోత్రాతో కియారా డేటింగ్ చేస్తోందని విశేషంగా వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘పెళ్ళయ్యే దాకా సింగిల్ గానే ఉంటాను’ అని చెప్పి అందరినీ ఆకట్టుకుంది కియారా. ఏది ఏమైనా కియారా అందం నవతరం అబ్బాయిలకు బంధాలు వేస్తోంది. ఆమె మరిన్ని చిత్రాలతో మరింతగా అలరిస్తుందని ఆశిద్దాం.
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!