బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేడు తన 56 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా సల్మాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు చిరు , చరణ్, వెంకటేష్ లాంటి వారు సల్లు భాయ్ కి తమదైన రీతిలో విషెస్ తెలిపారు. తాజాగా మాజీ ప్రేయసి, కొత్త పెళ్లికూతురు కత్రినా, సల్మాన్ కి బర్త్ డే విషెస్ తెలిపింది.
ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె సల్మాన్ ఫోటోను షేర్ చేస్తూ ‘హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ యూ. నీ జీవితంలో ఉన్న లవ్, లైట్ అండ్ బ్రిలియన్స్ ఎప్పటికీ అలాగే ఉండాలి అని కోరుకుంటున్నా” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషెస్ నెట్టింట వైరల్ గా మారింది. కత్రినా, సల్మాన్ కలిసి ‘పార్ట్‌నర్, భారత్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్’ సినిమాలలో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి ఆమధ్య ప్రేమ చిగురించిందని, ఆ తరువాత కొన్ని కారణాల వలన వీరు విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ‘టైగర్ 3’ సినిమాలోనూ వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇక ఇటీవలే కత్రినా మరో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకునం సంగతి తెలిసిందే.
https://www.instagram.com/stories/katrinakaif/2737756886002927669/