నటునిగా అలరించాలని పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్న దేవదాస్ కనకాల, తరువాతి రోజుల్లో ఎందరో నటులను తయారు చేసిన నటశిక్షకునిగా నిలిచారు. ఆయన సతీమణి లక్ష్మి సైతం పలువురు స్టార్స్ కు నటనలో శిక్షణ ఇచ్చినవారే. ఈ దంపతుల వద్ద శిక్షణ తీసుకున్న వారెందరో నేడు చిత్రసీమలో రాణిస్తున్నారు. వారి తనయుడు రాజీవ్ కనకాల ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా అలరిస్తున్నారు. ఇక కోడలు సుమ స్టార్ యాంకర్ గా జైత్రయాత్ర…
సరిగమలతో సావాసం చేస్తూ, పదనిసలతో పయనించాలని చక్రి బాల్యం నుంచీ తపించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి సహకారంతో కాసింత సంగీతం నేర్చి, ఆ పై సాధనతో పట్టు సాధించారు. ఆరంభంలో ఓ ఆల్బమ్ తయారు చేసి, తన బాణీలు వినిండి అంటూ సినిమా రంగంలో తిరగసాగారు చక్రి. అప్పుడు ఈ పోరడు ఏం సంగీతం చేయగలడు అని పెదవి విరిచినవారే అధికం! అయితే ఆ పోరడు బాణీలతో ఆడుకొనే వీరుడు అని కొందరు అభిరుచిగల సినీజనం భావించారు.…
‘అమ్మ’ పాత్రల్లో మేటిగా నటించి మెప్పించడమే కాదు, నిజజీవితంలోనూ ఎందరి చేతనో ‘అమ్మా’ అని పిలిపించుకున్న మహానటి పి.శాంతకుమారి. ప్రముఖ తెలుగు దర్శకులు పి.పుల్లయ్య సతీమణి శాంతకుమారి. పుల్లయ్యను ‘డాడీ’ అని, శాంతకుమారిని ‘మమ్మీ’ అంటూ పలువురు నటీనటులు, నిర్మాతలు, సాంకేతికనిపుణులు అభిమానంగా పిలిచేవారు. ఆ దంపతులు సైతం ఎంతోమందిని తమ కన్నబిడ్డల్లాగే చూసుకొనేవారు. చిత్రసీమలో ఆదర్శప్రాయమైన జంటల్లో పుల్లయ్య, శాంతకుమారి ముందు వరుసలో ఉంటారు. ఈ దంపతులిద్దరికీ తెలుగుచిత్రసీమలో ప్రతిష్ఠాత్మకమైన ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ లభించడం…