స్వరాలతో విక్రమించిన చక్రి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిగమలతో సావాసం చేస్తూ, పదనిసలతో పయనించాలని చక్రి బాల్యం నుంచీ తపించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి సహకారంతో కాసింత సంగీతం నేర్చి, ఆ పై సాధనతో పట్టు సాధించారు. ఆరంభంలో ఓ ఆల్బమ్ తయారు చేసి, తన బాణీలు వినిండి అంటూ సినిమా రంగంలో తిరగసాగారు చక్రి. అప్పుడు ఈ పోరడు ఏం సంగీతం చేయగలడు అని పెదవి విరిచినవారే అధికం! అయితే ఆ పోరడు బాణీలతో ఆడుకొనే వీరుడు అని కొందరు అభిరుచిగల సినీజనం భావించారు. అలా భావించిన దర్శకుడు పూరి జగన్నాథ్ తన ‘బాచి’ సినిమాతో చక్రిని సంగీత దర్శకునిగా పరిచయం చేశారు. తొలి ప్రయత్నంలోనే చక్రి స్వరాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆ తరువాత వరుసగా పూరి జగన్నాథ్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తూ ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రముఖ సంగీత దర్శకుడై పోయారు. చక్రి బాణీల్లో ఏదో కొత్తదనం ఉందని భావించిన వారంతా అతని సంగీతం కోసం పరుగులు తీశారు. చక్రి సైతం తన శక్తివంచన లేకుండా జనం మెచ్చే సంగీతం అందిస్తూ అలరించార
చక్రి స్వరకల్పలో కొన్ని పాత రాగాలు వినిపిస్తాయనే వారూ లేకపోలేదు. అయితేనేమి నిర్మాతలు, దర్శకులు తనపై పెట్టికున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాణీలు కట్టేవారు. ఆ రోజుల్లో చక్రి ఆడియోలకు కూడా మంచి మార్కెట్ ఉండేది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఆంధ్రావాలా, శివమణి, దేశముదురు” చిత్రాలకు చక్రి సమకూర్చిన సంగీతం యువతను ఉర్రూతలూగించింది. చక్రిని చూసి ఆరంభంలో పెదవి విరచిన వారంతా కోడిగుడ్డు మీద ఈకలు పెరికే ప్రయత్నం చేస్తూ, అతని బాణీలు ఆ పాటకు కాపీ, ఈ పాటకు మక్కీకి మక్కీ అంటూ ప్రచారం చేయసాగారు. చక్రి తన కార్యాలయంలో తను కూర్చునే సీటుకు ఓ వైపు ఇళయరాజా, మరో వైపు ఎ.ఆర్.రహమాన్ చిత్రపటాలు పెట్టుకొని, ఆనందించేవారు. తనను విమర్శించేవారికి తాను ఎవరి బాణీలు చూసి స్ఫూర్తి చెందుతానో జనం అర్థం చేసుకోవాలని చెప్పకనే చెప్పేవారు. కానీ, జనం ఈవేమీ పట్టించుకోకుండానే చక్రి బాణీలకు జై కొట్టారు.
Also Read
ఇతర దర్శకులు రూపొందించిన చిత్రాలకు సైతం చక్రి తనదైన బాణీలతో అలరించారు. “అమ్మాయిలు అబ్బాయిలు, సత్యం, వీడే, దేవదాస్, ఢీ, కృష్ణ, మస్కా, సింహా, దేనికైనా రెడీ, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వెన్నెల్లో హాయ్ హాయ్” వంటి చిత్రాల్లోనూ చక్రి స్వరకేళి జనాన్ని ఆకట్టుకుంది. చక్రి తన అభిమాన సంఘాల ద్వారా పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించేవారు. ఇప్పటికీ ఆయన అభిమానులు అదే పంథాలో పయనిస్తూ ఉండడం విశేషం. పిన్నవయసులోనే చక్రి లాంటి ప్రతిభావంతుడు కన్నుమూయడం తెలుగు సినిమాకు తీరని లోటే! అయితే చక్రి పలికించిన బాణీలు ఈ నాటికీ జనాన్ని పులకింప చేస్తూనే ఉండడం విశేషం. ఆయన సంగీతాన్ని తలచుకుంటూనే ఫ్యాన్స్ పరవశించి పోతున్నారు.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..