Rahul Gandhi: సుశీల్ మోడీ రాహుల్ గాంధీపై పెట్టిన పరువు నష్టం కేసు పరిస్థితేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై సుశీల్ మోడీ ‘మోడీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సుశీల్ మోడీ మృతి చెందారు. ఇప్పుడు ఆ కేసు ఎటువైపు వెళ్తోందనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. కాగా, 2019 ఏప్రిల్ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దీనిపై సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఆ మరునాడు ఆయనపై అనర్హత వేటు వేశారు. తరువాత అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటును తొలగించింది.
READ MORE: Pushpa 2 : సినిమాలో అనసూయ పాత్ర మరింత వైల్డ్ గా ఉండబోతుందా..?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇదిలా ఉండగా.. బీహార్ బీజేపీ నాయకుడు, దివంగత నేత సుశీల్ కుమార్ మోడీ కూడా గతేడాది రాహుల్ గాంధీపై ‘మోడీ ఇంటిపేరు’ కేసు పెట్టారు. ఆయనపై ఈ పరువునష్టం కేసు నమోదైంది. ఏప్రిల్ 2023లో, రాహుల్ గాంధీపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి పాట్నా హైకోర్టు ఇక్కడ ట్రయల్ కోర్టు ముందు విచారణను నిలిపివేసింది. సుశీల్ మోడీ కేసులో పాట్నా హైకోర్టు ఈ ఏడాది మే 15 వరకు స్టే విధించింది. సుశీల్ మోడీ మృతితో రాహుల్ పై ఆయన కేసు ఏమవుతుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. సుశీల్ మోడీ వారసులు కేసును కొనసాగించాలంటే చట్టపరంగా అవకాశం ఉంటుందని పలువురు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. భారతదేశంలో ఫిర్యాదుదారు చనిపోతే పరువు నష్టం కేసు సాధారణంగా ముగియదు. ఫిర్యాదుదారు ప్రతినిధి, కుటుంబ సభ్యుల స్థానంలో చట్టపరమైన చర్యలు కొనసాగవచ్చు. ఫిర్యాదుదారుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎవరూ లేకుంటే.. కోర్టు కేసును కొట్టివేయవచ్చు.
- Tags
- against
- bihar
- defamation case
- Delhi
- ptna
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..