Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
- రేఖా గుప్తా ఇంట్లో హరియాలీ తీజ్ వేడుకలు
- కంగనా రనౌత్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిర్వహించిన హరియాలీ తీజ్ వేడుకల్లో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పాల్గొని సందడి చేశారు. ముఖ్యమంత్రితో కలిసి డ్యాన్స్ చేశారు. ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా కార్యక్రమం జరిగింది. తొలి తీజ్ వేడుక కోసం కంగనా లైమ్ గ్రీన్ సిల్క్ చీరను ధరించి సంప్రదాయ అందంతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ ఆభరణాలు, చేతులకు తాజాగా వేసుకున్న మెహందీతో ఆమె పండుగ వాతావరణానికి తగ్గట్టుగా కనిపించారు.

Also Read
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
కంగనా ధరించిన చీర లైమ్ గ్రీన్ సిల్క్ బేస్‌తో ఉండగా.. కోరల్, పింక్ రంగులతో కూడిన పల్లూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్లూపై చెట్లు, పక్షుల డిజైన్లు ఉన్నాయి. ఈ చీర కాంజీవరం సిల్క్ చీరలా కనిపిస్తున్నప్పటికీ.. అది కాంజీవరం చీరేనని అధికారికంగా నిర్ధారణ కాలేదు. దీనికి మ్యాచింగ్ లైమ్ గ్రీన్ బ్లౌజ్‌ను కంగనా జత చేశారు. కంగనా తన లుక్కు బంగారం, ముత్యాలు, పచ్చలతో కూడిన సంప్రదాయ ఆభరణాలను ధరించారు. చోకర్ నెక్లెస్, జుంకాలు వేసుకున్నారు. జుట్టును మధ్య పాపిటతో వెనక్కి దువ్వి లో బన్‌గా కట్టుకున్నారు. బిందీ పెట్టుకుని తన సంప్రదాయ లుక్‌ను పూర్తి చేశారు.

తీజ్ వేడుకల సందర్భంగా తీసుకున్న ఫొటోలను కంగనా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘రేఖా దీదీ ఇంట్లో నా తొలి తీజ్ వేడుక. పెద్ద అక్క చూపించే ప్రేమ, ఆప్యాయతతో నిజంగా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. అందరికీ తీజ్ శుభాకాంక్షలు’’ అని ఆమె పేర్కొన్నారు.
కాంజీవరం చీరలకు ప్రత్యేక గుర్తింపు
కాంజీవరం సిల్క్ చీరలు తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో నేసే ప్రసిద్ధ సంప్రదాయ చీరలు. వీటికి 2005-06లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. కాంచీపురంలో చేనేత చీరల తయారీ చరిత్ర క్రీస్తుశకం 10వ శతాబ్దం నాటికే ఉన్నట్లు సమాచారం. కాంజీవరం చీరల తయారీలో కర్ణాటక నుంచి సేకరించే మల్బరీ సిల్క్‌ను ఉపయోగిస్తారు. ఈ సిల్క్ కారణంగా చీరలకు మృదువైన, మెరిసే ఫినిష్ వస్తుంది. ఈ చీరల తయారీలో ఉపయోగించే బంగారు జరీలో సుమారు 75 శాతం గుజరాత్‌లోని సూరత్ నుంచి వస్తుందని సమాచారం. గతంలో కాంజీవరం చీరలను తొమ్మిది గజాల పొడవుతో కూడా నేసేవారు.

కంగనా రనౌత్ ‘వోకల్ ఫర్ లోకల్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ భారతీయ చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్నారు. ఫ్యాషన్, రాజకీయాలను కలిపి చూపిస్తున్న కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఆమె ఒకరు. తన నియోజకవర్గమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ ప్రాంతానికి చెందిన చేనేత కళాకారులను కూడా కంగనా ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐవరీ షిఫాన్ చీరపై మల్టీకలర్ ఓవర్‌కోట్ ధరించి కంగనా కనిపించారు. ఆ కోట్‌ను తన నియోజకవర్గంలోని మహిళలు ‘కుల్వి విహిమ్స్’ మార్గదర్శకత్వంలో తయారు చేసినట్లు ఆమె తర్వాత వెల్లడించారు. స్థానిక కళాకారులు, సంప్రదాయ హస్తకళలకు ప్రచారం కల్పించేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో ఉదాహరణగా నిలిచింది.
పార్లమెంట్‌లోనూ…
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కంగనా ధరించే విభిన్న రకాల చీరలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా కచ్‌కు చెందిన డస్టీ పింక్ చీరను ధరించారు. ఇకత్, కోట్పాడ్, పైఠణీ, బనారసీ, కాంజీవరం, ఖాదీ వంటి భారతీయ చేనేత చీరలను ధరించడం ద్వారా కంగనా దేశీయ వస్త్ర సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?