దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చాలా ప్రాక్టికల్ మనిషి. పిల్లలను సైతం అలానే పెంచారు. దాంతో సంప్రదాయ బద్ధంగా తండ్రి కాళ్ళకు నమస్కారం పెట్టడం వంటివి వారికి అలవడలేదు. బిగ్ బాస్ సీజన్ 5 షోలో నాగార్జున ఇదే విషయాన్ని తెలియచేశారు. శనివారం షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ – నాగ్ మధ్య ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చాయి. ‘ట్రిపుల్ ఆర్’ ఎలా వస్తోందని నాగ్ అడిగినప్పుడు…
బిగ్ బాస్ సీజన్ – 5 లో సెప్టెంబర్ 18వ తేదీ హౌస్ మేట్స్ కు ఓ స్పెషల్ డే! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… శనివారం నాగార్జునతో కలిసి డయాస్ ను షేర్ చేసుకున్నాడు. అయితే చెర్రీ బిగ్ బాస్ షో లో పాల్గొనడానికి ఓ స్పెషల్ రీజన్ ఉంది. అతను తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దానికి సంబంధించిన ప్రోమోను నాగార్జున బిగ్…
వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ రెండవ వారం ఎలిమినేషన్ విషయం ఆసక్తికరంగా మారింది. మొదటి వారం కాస్త సైలెంట్ గా ఉన్న బిగ్ బాస్ రెండవ వారం మాత్రం హౌజ్ మేట్స్ ను టాస్క్ పేరుతో ఉరుకులు, పరుగులు పెట్టించారు. వీక్ మొత్తం టాస్కులతోనే గడిచింది. ఇంటి సభ్యుల మధ్య గొడవలు, ప్రేమలు చూపించారు. మొత్తానికి శనివారం వచ్చేసింది. మొదటి వారం సరయు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రెండవ వారం నామినేషన్ లో ఉమ, నటరాజ్,…
బిగ్ బాస్ సీజన్ 5 షో చూస్తుండగానే 12వ రోజులోకి అడుగుపెట్టింది. రాత్రి దాదాపు ఒంటి గంట వరకూ హౌస్ మెంబర్స్ ను ఏదో రకంగా ఎంగేజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. దాంతో మర్నాడు ఉదయం 9.30 తర్వాత కానీ నిద్ర లేపడం లేదు. 12వ రోజున డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లోని దోస్తీ సాంగ్ తో సభ్యులంతా నిద్రలేచారు. ఎప్పటిలానే డాన్స్ లు చేశారు. అయితే ఇది మూవీ థీమ్ సాంగ్…
బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ కెప్టెన్ సిరి కాలపరిమితి 11వ రోజుతో పూర్తయ్యింది. ఆమె తర్వాత కెప్టెన్ గా విశ్వ ఎంపిక కావడం విశేషం. ‘పంతం నీదా నాదా’ గేమ్ థర్డ్ ఫేజ్ లో ‘అగ్గిపుల్లా మజాకా’ అనే ఆటను బిగ్ బాస్ ఈగల్, ఊల్ఫ్ టీమ్స్ తో ఆడించాడు. అందులో ఈగల్ టీమ్ విజయం సాధించింది. గత మూడు రోజులుగా జరిగిన పోటీల ద్వారా ఈగల్ టీమ్ కు 6, ఊల్ఫ్ టీమ్ కు…
సెప్టెంబర్ 16న షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు. యూ-ట్యూబర్, ఆర్టిస్ట్ అయిన షణ్ముఖ్ ను మిత్రులంతా షణ్ణూ అని అభిమానంగా పిల్చుకుంటారు. అతను ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపెంట్ గా ఉన్నాడు. 16వ తేదీతో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న షణ్ముఖ్ పై అతని గ్యాంగ్ కు భారీ ఆశలే ఉన్నాయి. కరెంట్ తీగలా కనిపించే షణ్ముఖ్ లో కసితో పాటు చాలా టాలెంట్ ఉందని, అతను తప్పనిసరిగా బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడని…
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లతో నాగార్జున 5 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంటూ చాలా ఉత్సాహంగా షోను హోస్ట్ చేశారు. అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ ను పరిచయం చేస్తూ హోస్ట్ గా నాగార్జున చేసిన ఫన్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల నుంచి బిగ్ బాస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు…
“బిగ్ బాస్ సీజన్ 5” కంటెస్టెంట్ సిరిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టాస్క్ సమయంలో సన్నీ తనను అసభ్యకరంగా తాకాడంటూ సిరి ఆరోపించడంతో దానికి కారణమైంది. బిగ్ బాస్ సీజన్ 2లో భాను, తేజస్విలతో ఆమెను పోలుస్తున్నారు. సీజన్ 2 సమయంలో భాను శ్రీ, తేజస్వి మరో కంటెస్టెంట్ కౌశల్‌తో ఇలాగే ప్రవర్తించారు. ఫిజికల్ టాస్క్ సమయంలో లేడీ కంటెస్టెంట్‌లను అతను అసభ్యకరంగా తాకాడంటూ ఆరోపించారు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. వారు ఆరోపించినట్లుగా…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 పై సోషల్ మీడియాలోనూ, ఛానెల్స్ లోనూ ప్రతికూల వార్తలు జోరందుకుంటున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ షోపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు గేమ్ లో పూర్తిస్థాయిలో లీనమై పోయి, ఒకరి మీద ఒకరు దాడులు, ప్రతిదాడులూ చేసుకోవడం మొదలెట్టేశారు. ఆడ, మగ అనే తేడా లేకుండా, నియమ నిబంధనలను పాటించకుండా, అసభ్య పదజాలంతో మాటల యుద్ధాలకు…
“బిగ్ బాస్ 5″లో రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం, మంగళవారం ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా ముసుగు తొలగిస్తుండడంతో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. అసభ్యకర కామెంట్స్ కారణంగా నెటిజన్లు ఉమాదేవిపై, పొగరుగా బిహేవ్ చేసినందుకు శ్వేత వర్మపై కూడా ఫైర్ అయ్యారు. శ్వేత వర్మ లోబో ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ని విసిరి అతడిని ఫేక్ అని పిలిచింది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనీ…