వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ రెండవ వారం ఎలిమినేషన్ విషయం ఆసక్తికరంగా మారింది. మొదటి వారం కాస్త సైలెంట్ గా ఉన్న బిగ్ బాస్ రెండవ వారం మాత్రం హౌజ్ మేట్స్ ను టాస్క్ పేరుతో ఉరుకులు, పరుగులు పెట్టించారు. వీక్ మొత్తం టాస్కులతోనే గడిచింది. ఇంటి సభ్యుల మధ్య గొడవలు, ప్రేమలు చూపించారు. మొత్తానికి శనివారం వచ్చేసింది. మొదటి వారం సరయు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రెండవ వారం నామినేషన్ లో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, అన్నీ, ప్రియాంక, ప్రియ ఉన్నారు. ముందుగా ఉమా ఇంట్లో ప్రదర్శిస్తున్న అహంకారం, అసభ్యకరమైన పదాలను వాడడం, ఆమె ప్రవర్తన కారణంగా ఆమె ఈ వారం ఇంటి నుండి వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఉమ సేఫ్ అని తెలుస్తోంది.
ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన పోటీదారులలో లోబో భారీ సంఖ్యలో ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఆయనకు ఇప్పటికే నాగార్జున ఎంటర్టైనర్ అఫ్ ది హౌజ్ అనే ట్యాగ్ ఇచ్చేశారు. ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఆయన అందిస్తున్న ఎంటర్టైన్మెంట్ కు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారు. తర్వాత స్థానంలో ప్రియాంక, ప్రియ ఉన్నారు. ఇద్దరూ ఇంట్లో అందరితో మంచి స్నేహభావంతో ఉండడమే వారిని సేఫ్ జోన్‌లో ఉంచింది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో ఆర్జే కాజల్ ఉంది. ఫస్ట్ వీక్ నుంచే ఆమెను టార్గెట్ చేసినట్టుగా నామినేట్ అవుతోంది కాజల్. దీంతో ఆమెకు సింపతితో పాటు ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది.
Read Also : చిక్కుల్లో సోనూసూద్… కోట్లలో పన్ను ఎగవేత
ఇక మిగిలింది ఉమా, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్. మొదట ఉమ వెళ్లిపోతుందని అంతా భావించినప్పటికీ ఆమెకు మంచి ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. టాస్కులలో ఆమె పోరాడిన తీరు, అలాగే నిన్నటి ఎపిసోడ్ లో ఆమె స్కిట్ లో కనబరిచిన నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు ప్రస్తుతం తెలుగు టెలివిజన్‌లో నంబర్ వన్ సీరియల్ అయిన “కార్తీక దీపం” సీరియల్ లో పాత్ర ద్వారా ఆమెకున్న ఇమేజ్ ఉమాకు సహాయం చేస్తోంది. ఈ వీక్ ఆమె స్క్రీన్ స్పేస్ బాగా లభించింది.
ఇక చివరగా మిగిలింది యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. యానీ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉంది. నటరాజ్ మాస్టర్ మాత్రం చాలామంది వీక్షకులకు కొత్త అని చెప్పొచ్చు. దీంతో ఈ వారం ఇంటి నుండి వెళ్లిపోయే ఛాన్స్ ఎక్కువగా నటరాజ్ మాస్టర్ కే ఉన్నట్లు అన్పిస్తోంది. మరి నాగ్ ఆదివారం ఎపిసోడ్ లో ఎవరిని బయటకు పంపిస్తారో వేచి చూడాలి.