రాష్ట్రoలోని ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం ముడి పామాయిల్ ధరలు స్థిరీకరించానికి ముడి పామాయిల్ దిగుమతి పై సుంకాలని విధించి పామాయిల్ గెలలకు లాభదాయకమైన ధరలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి భారత ప్రభుత్వం 1992 నుండి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ సాగు అభివృద్దిని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతము, రాష్ట్రంలో ఆయిల్ పామ్…
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ పర్యటనలో భాగంగా ఇవాళ అన్నారం బ్యారేజీ వద్ద బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుంది అని రేవంత్ ఆలోచన లా కనిపిస్తుందన్నారు. అసలు కేసిఆర్ నే లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను…
ఆ జిల్లాలో పసుపు, చక్కెర కలిసిపోయి పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. గత ఎన్నికల్లో పసుపు ఒకరికి శుభం పలికితే… ఇంకొకరికి మర్చిపోలేని మంట పుట్టించింది. ఇప్పుడిక చక్కెర వంతొచ్చింది. ఇప్పుడది ఎవరికి స్వీటు? ఎవరికి ఘాటు కాబోతోంది? అసలు పసుపు, చక్కెర చుట్టూ జరుగుతున్న పొలిటికల్ గేమ్ ఏంటి? ఎక్కడ జరుగుతోందా రాజకీయం? నేతల మాటల్ని జనం మూట కట్టుకుంటున్నారా? పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే.. నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. కాకుంటే… బోధన్ చక్కెర…
త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వాళ్ల సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు సూచనలు అందిస్తుందని అన్నారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్టి ముచ్చటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి…
నేడు బీజేపీ తొలి జాబితా.. లిస్ట్‌లో మోడీ, అమిత్ షా! పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రచారాలు కూడా మొదలెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో త్వరలోనే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశం అయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము…
బండి సంజయ్ కి ఏం తెలియదని, ఆయన ని అంత సీరియస్‌గా తీసుకోకండి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఆస్తులపై విచారణకి సిద్ధమన్నారు. అంతేకాకుండా.. అవినీతిపరుడైన వ్యక్తి నిజాయితీ గల మీద ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో మోడీ చర్యలు దుర్మార్గమని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు కూల్చడం దుర్మార్గమని, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ..…
విజయ సంకల్ప యాత్ర రోడ్ షో సందర్బంగా వారసిగూడాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని, ఈ దేశంలో అవీనితిరహిత, శాంతి భద్రతలు బడుగు బలహీనులకు సంక్షేమ పాలనకు అందించే విధంగా తొమ్మిదిన్నర ఏళ్ళుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందన్నారు. ఈ దేశం కోసం, పిల్లల భవిష్యత్, పేదల ప్రజల సంక్షేమం కోసం ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యం చేయడానికే…
బీజేపీ నేత భాస్కర్ గౌడ్ తన మీద తానే హత్య ప్రయత్నం చేయించుకున్నట్లు పోలీసుల గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేత భాస్కర్ గౌడ్ నామీద హత్య ప్రయత్నం జరిగిందని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో.. కేసు నమోదు చేసుకొని ఉప్పల్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాస్కర్ గౌడ్ నిందితుడని తెలియడంతో అతనితో పాటు ఇంకో ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో…