తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. మార్చి 18 నుండి ఏప్రిల్ రెండు వరకు 10 వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యా్హ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ భాష (కాంపోజిట్ కోర్సు) ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉంటుంది.…
తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్.. రేవంత్ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కేటీఆర్ మాట్లాడితే ఆశ్చర్యంగా అనిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని ఆయన అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారన్నారు. కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్.. సీఎం రేవంత్ అంటూ ఆయన…
ఎల్‌ఆర్‌ఎస్‌పై ఇచ్చిన జీవో లు రెండు కూడా గత ప్రభుత్వం ఇచ్చినవే కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చిన జీవో లోనే ధరలు నిర్ణయించారని, అనధికార లే అవుట్లు అన్ని.. చెరువులు..అసైన్డ్ భూములు.. ప్రభుత్వ భూములు అక్రమించి చేసినవే అని ఆయన అన్నారు. అక్రమ లే అవుట్లు జరుగుతుంటే మీరు నిద్ర పోయారా.. లేకుంటే మీ నాయకులకు దోచుకోండి అని అనుమతి ఇచ్చారా..? అని…
మూడు గంటలపాటు రైతులు చెప్పిన మాటలు విన్నామని, మాటలు తక్కువ చెబుతాం, పని ఎక్కువ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెనిఫెస్టో లో ముత్యంపేట షుగర్ ప్రాజెక్టు తెరిపింఛాలని అన్న అంశం పెట్టించారని, ముందు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలన్నాడని, ఖజనాలో రూపాయి లేకున్నా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. భోధన్ షుగర్ ఫ్యాక్టరీ ని…
మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలాని కళాశాల వేదికగా జరుగుతున్న వేడుకలలో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. బిట్స్ పిలాని కళాశాలలో వీ ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ సన్మానించారు. మహిళా దినోత్సవం అనేది ఒక్క రోజు కాదు ప్రతిరోజు మహిళలని గౌరవించాలన్నారు. మహిళలు అన్నిరంగాలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాడ్మిటన్ ప్లేయర్ సైనా…
నేడు మంగళగిరిలో టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏఎన్‌యూ ఎదురుగా ఉన్న స్థలంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరవనున్నారు. బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ…
పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడే.. బలి చక్రవర్తి చంద్రబాబును పవన్ తొక్కబోతున్నాడు.. అది బాబు గమనించాలని ఎద్దేవా చేశారు. ఎవరైనా పార్టీ పెడితే అదికారంలోకి రావాలని కోరుకుంటారు.. ప్రజలకు సేవచేయాలని వస్తారు.. పవన్ లా వేరే వాళ్లను ముఖ్యమంత్రిని చేయాలని రారని పేర్కొన్నారు. జగనన్న దెబ్బకు పవన్‌కు భయమేస్తుంది అందుకే అతనికి కేటాయించిన 24 స్థానాలలో…
నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్.. త్వరలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దీంతో గులాబీ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు రానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 10…
కేంద్రం జోక్యంతో భారతీయ యాప్‌ల పునరుద్ధరణకు అంగీకరించిన గూగుల్.. సర్వీస్ ఫీజుల వివాదంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్‌లను తొలగించింది. అయితే, దీనిపై సదరు యాప్‌ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ కంపెనీ అధికారులతో సమావేశమైన తర్వాత, తొలగించిన యాప్‌లను పునరుద్ధరించేందుకు గూగుల్ అంగీకరించినట్లు సమాచారం. శుక్రవారం గూగుల్ 10…
ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మరో గ్యారెంటీ పై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పై కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇండ్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారో.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో…