ఏపీలో రేపట్నుంచి 60 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10-13 వరకు హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోసులు, 12, 13వ తేదీల నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసులు ఇవ్వనున్న ప్రభుత్వం పేర్కొంది. మున్సిపాల్టీలు, పీఆర్ అండ్ ఆర్డీ, పోలీస్ శాఖలోని వివిధ విభాగాల ఉద్యోగులకు…
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వ్యాప్త నేపథ్యంలో భారీగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబందనలు కఠినతరం చేయడంతో పాటు, నైట్ కర్ఫ్యూను విధిస్తున్నారు. అయితే తెలంగాణలో సైతం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే తాజాగా వచ్చిన కరోనా కేసలు సంఖ్య నిన్నటితో పోల్చితే తక్కువగా…
గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ జూన్ 30వ తేదీ నాటికి ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి కాబోతున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రొబేషన్‌పై విముఖతతో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించారు. ప్రొబేషన్ డిక్లరేషన్ సాధనే లక్ష్యంగా కార్యాచరణ ప్రకటన చేశారు. పే స్కేల్ కూడా కల్పించాలని గ్రామసచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులంతా ట్విట్టర్ ద్వారా డిమాండ్ తెలపాలని సూచించారు. రేపు నల్ల రిబ్బన్లతో విధులకు…
రాష్ట్రంలో నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులకు కేసీఆర్ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌ల అనుమతుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘం వారు కోరుతున్న అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి…
భారత్‌లోకి ప్రవేశించేందుకు పాకిస్తానీలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రాదేశిక జలాల్లోకి పాకిస్తాన్‌కు చెందిన ఓ బోట్ ప్రవేశించడంతో స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు చెందిన బోట్‌లో ఉన్న 10 మందిని గుజరాత్ తీరరక్షక దళం అదుపులోకి తీసుకుంది. అయితే పట్టుబడ్డిని వారిని విచారణ నిమిత్తం పోర్ బందర్‌కు గుజరాత్ తీరరక్షక దళం తరలించింది. గుజరాత్‌లో గత నెల 20న కూడా భారత ప్రాదేశిక జలాల్లోకి వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన ఓ బోట్‌ను గుజరాత్…
ప్రశాంతమైన కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ఆత్మకూర్ సంఘటన అనంతరం హుటాహుటిన సంబంధిత ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే…
కరోనా రక్కసి మరోసారి దేశంలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోజురోజు భారీగా నమోదవుతున్నాయి. గత వారం రోజుల క్రితం దేశవ్యాప్తంగా రోజుకు 50 వేల లోపు నమోదవుతున్న కరోనా కేసులు సంఖ్య తాజాగా లక్షన్నరకు చేరువలో నమోదవుతున్నాయి. దీనిబట్టే అర్థచేసుకోవచ్చు కరోనా ఏ రేంజ్‌లో వ్యాప్తి చెందుతుందోనని. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవలం ముంబాయిలోనే 20వేలకుపైగా కేసులు…
317 జీవోను సవరించేదాకా తెగించి కొట్లాడతాం.. కేసీఆర్.. మీరు చేయకపోతే అధికారంలోకి వచ్చాక తొలిరోజే జీవోను సవరిస్తాం.. టీచర్లూ….ఆత్మహత్యలొద్దు మీ వెంట మేమున్నాం.. అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. సంజయ్‌ను కలిసి 317 జీవోవల్ల ఎదురవుతున్న ఇబ్బందులు టీచర్లు వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న 317 జీవోను సవరించేదాకా తెగించి కొట్లాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్…
సీపీఐ, సీపీఎం పార్టీల జాతీయ అగ్రనాయకత్వం శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగునున్న కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సీపీఎం పార్టీ జాతీయ నేతలు హైద్రాబాద్ కు రాగా… సీపీఐ పార్టీ అనుబంధ అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు సీపీఐ నేతలు వచ్చారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రగతి భవన్ కు విడి విడిగా వచ్చిన ఉభయ కమ్యునిస్టు పార్టీల…
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పై నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పాలకోల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఇతర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులపక్షాన పోరాడి వైసీపీ ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రైతులకోసం కేంద్రప్రభుత్వ సాయంతో అమలుచేసే పథకాలకు జగన్ తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు.…