స్వర శిఖరం మూగబోయింది.. సంగీత ప్రియుల గుండెల్లో తీరని శోకాన్ని మిగిల్చి ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్ అందిరికి అందనంత ఎత్తుకు ఎగిరిపోయారు. లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్త ఆమె అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో. ప్రయాణాల్లో, పనుల్లో ప్రతి ఒక్కరి ఫేవరేట్ గా ఉన్న లతాజీ సాంగ్స్ ఉన్నాయి. ఒక గాయనిగా ఆమె లిఖించిన చరిత్ర తిరుగులేనిది. ఆమె కీర్తి అజరామరం. ఆమె అందుకున్న విజయాలు అనంతం. .
2022 జనవరి 11న లతా మంగేష్కర్ కరోనా బారినపడ్డారు. ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. లతాజీ వయసు రీత్యా వైద్యం అందించడానికి ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి దిగారు. దాదాపు నెల రోజులుగా లతాజీ ఐసీయూలో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ట్ తీసుకుంటున్నారు. లతాజీ ఆర్యోగం మెరుగుపడుతుందని, వెంటిలేటర్ సపోర్ట్ తీసేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అనూహ్యంగా లతాజీ ఆరోగ్యం మరలా క్షీణించడం మొదలుపెట్టింది. వైద్యులు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. 92 ఏళ్ల లతా మంగేష్కర్ తనువు చాలించారు.