సీఎం కేసీఆర్ ఏమన్నాడని ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నారు? బీజేపీ వాళ్ళు అయితే బట్టలు చింపుకొని మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రైతు చట్టాల పై మోడీ క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత లేదని, మోడీ ఆరోజే రాజీనామా చేయాలి. సీఎం కేసీఆర్ రాష్ట్రాల హక్కులపై పోరాటం చేసే అవసరం ఎందుకు వచ్చిందని ఆయన అన్నారు. విభజన హామీలు ఎటు పోయాయి, ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు ఈ కేంద్ర ప్రభుత్వమని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎటు పోయింది.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయిందో ఈ వెధవ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉందా లేదా అని దుయ్యబట్టారు. నేషనల్ లెవల్ లో ఎదుగుతున్న సీఎం కేసీఆర్ తొక్కే ప్రయత్నాలు చేస్తోంది ఈ బీజేపీ అని ఆయన అన్నారు.
మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నందున ఇవాళ నిధులు అన్ని కూడా మీరు పాలించే రాష్ట్రాలకి ఇస్తే పోరాటం చేయడం తప్పేంటని, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ఇస్తే మీరు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. దళిత బంధు ఇస్తున్న సీఎం కేసీఆర్ మీరు విమర్శలు చేస్తుంటే మీరు ఎంత దుర్మార్గపు మనుషుల్లో అర్థం అవుతుంది. దళితుల మీద మీకు ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఎందుకు దళిత బంధు ఇవ్వడం లేదు…ఇచ్చే దమ్ము మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. దళితలకు న్యాయం చేసే దమ్ము దైర్యం మీకు ఉందా ..కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకుంటే ఖబర్దార్ మిస్టర్ బండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. నేను దళిత బంధు పోగ్రాం లో కూర్చుంటే ఎంతో సంతోషంగా ఉంది, రేపటి బడ్జెట్ లో 20 వేల కోట్లు పెట్టబోతున్నారు సీఎం కేసీఆర్ అని ఆయన వెల్లడించారు.