RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ బ్యాంక్ సేవలతో మీకు ఏదైనా సమస్య ఎదురైందా? బ్యాంక్ తప్పుల వల్ల మీ డబ్బులు నిలిచిపోవడం లేదా నష్టపోవడం వంటివి జరిగాయా? అయితే, మీ సమస్యపై బ్యాంకుకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన రీతిలో స్పందించకపోతే, ఇప్పుడు మీరు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తలుపు తట్టవచ్చు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన నూతన ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్’ (RBI Ombudsman Scheme) కింద కస్టమర్లకు రూ.33 లక్షల వరకు పరిహారం పొందే సువర్ణావకాశం లభిస్తోంది. బ్యాంకింగ్ సేవల్లో లోపాల వల్ల ఇబ్బంది పడే ఏ కస్టమర్ అయినా ఈ పథకం కింద ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
అయితే.. ఆర్బీఐని ఆశ్రయించే ముందు, సంబంధిత బ్యాంకులో ముందుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం తప్పనిసరి. అక్కడ ఫిర్యాదు చేసిన నెల రోజుల్లోగా ఎలాంటి పరిష్కారం లభించకపోయినా లేదా బ్యాంక్ ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తికరంగా లేకపోయినా, మీరు ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. దీని కోసం కస్టమర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఖర్చు లేకుండా, అత్యంత వేగంగా, సులభతరంగా వివాదాలను పరిష్కరించేందుకు ఆర్బీఐ ఈ ఉచిత వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఇది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (NBFCs), ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీలు, క్రెడిట్ సమాచార సంస్థలపై వర్తిస్తుంది.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఈ పథకం కింద ఫిర్యాదు చేసే వివాద పరిమితిపై (డిస్ప్యూట్ అమౌంట్) ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ఎంత పెద్ద మొత్తానికి సంబంధించిన వివాదాన్నైనా ఇక్కడ ప్రస్తావించవచ్చు. అయితే, బ్యాంక్ లోపాల వల్ల కస్టమర్లకు జరిగిన ప్రత్యక్ష ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి అంబుడ్స్‌మన్ గరిష్టంగా రూ.30 లక్షల వరకు నష్టపరిహారం మంజూరు చేయవచ్చు. దీనితో పాటు కస్టమర్ల సమయం వృధా కావడం, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అదనంగా మరో రూ.3 లక్షల వరకు ప్రత్యేక పరిహారాన్ని కూడా కేటాయించవచ్చు.
ఈ విధంగా బాధిత వినియోగదారుడికి మొత్తం కలిపి గరిష్టంగా రూ.33 లక్షల వరకు పరిహారం దక్కే అవకాశం ఉంది. ఈ ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు సమర్పించేటప్పుడు కస్టమర్ తన పేరు, మొబైల్ నంబర్, పూర్తి చిరునామా, వివాదంలో ఉన్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ పేరు, బ్యాంకుకు గతంలో చేసిన ఫిర్యాదు నంబర్, ఖాతా లేదా లోన్ వివరాలు, గతంలో బ్యాంక్ నుండి అందుకున్న తిరస్కరణ లేఖల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. డిజిటల్ విధానంలో కూడా సులభంగా ఆన్లైన్ ద్వారా ఆర్బీఐ అధికారిక పోర్టల్‌లో ఈ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!