మంత్రి పదవి వస్తదనే అనుకుంటున్నా... కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాజాగా చిట్‌చాట్‌లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. భువనగిరి ఎంపీ బాధ్యతలు ఇస్తే.. సమర్థవంతంగా నిర్వహించానని గుర్తు చేశారు. తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమన్నారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తాని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు..
Komati Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. గిరిధర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తనకు ఎలాంటి సమాచారం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దు కానుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సభపై ఆంక్షలు తగదు.. ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న జనగర్జన సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదు.. రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి..?
Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. హైద్రాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న థాక్రేతో సమావేశమైన కోమటిరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకిచ్చిన AICC షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోనని అన్నారు.…