Komati Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. గిరిధర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని కోకాపేట్ హిడెన్ గార్డెన్‌లోని గిరిధర్ రెడ్డి నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బడంగపేట మున్సిపల్ చైర్ పర్సన్ పారిజాత నర్సింహారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంధువు గిరిధర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. గిరిధర్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, పన్ను చెల్లింపులపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
గతంలో కూడా హైదరాబాద్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఎన్నికల వేళ ఐటీ అధికారుల సోదాలు చర్చకు దారితీశాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు సోదాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. బీఆర్‌ఎస్ కోసం తమ పార్టీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులతో బీజేపీ నాయకత్వం సోదాలు చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ఏడాది జూన్ 14న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పైల శేఖర్ రెడ్డి పెట్టుబడులు పెట్టారనే అనుమానంతో 15 కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. పైళ్ల శేఖర్ రెడ్డికి పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వాటాలు ఉన్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5న హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది మే 2న హైదరాబాద్‌లోని పలు ప్రముఖ వస్త్ర దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Kunamneni: మాట మారిస్తే సరైంది కాదు… కాంగ్రెస్ తో పొత్తు ఇవాళ, రేపు ఫైనల్ అవుతుంది