Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తనకు ఎలాంటి సమాచారం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తుల విషయంపై ఈరోజు సాయంత్రంలోగా స్పష్టత వస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ అసెంబ్లీ సీటు తమ బలమైన స్థానమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉందని వెంకట్ రెడ్డి తెలిపారు. 10-15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంటుందన్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిప్పర్తి మండలానికి చెందిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఈరోజు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్‌లో చేరిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
2022 ఆగస్టులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు బీజేపీకి రాజీనామా చేశారు. ఎల్లుండి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఫోన్‌లో చర్చలు జరిపారు. టికెట్‌పై కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. 2018 ఎన్నికల్లో అదే అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వివేక్ వెంకటస్వామితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వివేక్ వెంకటస్వామి చర్చలు జరిపారు.
Vivek Venkataswamy: నేను బీజేపీకి రాజీనామా చేయ్యను.. రాజగోపాల్ రెడ్డి గురించి నాకు తెలియదు..