నేడు భోగి పండుగ తో పాటు షట్తిల ఏకాదశి. అంటే తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజైన భోగి పండుగ నేడు ఎంతో విశిష్టతను సంతరించుకుంది. సాధారణంగా భోగి మంటలు, పిండి వంటలతో సందడిగా సాగే ఈ పండుగకు ఈ ఏడాది అదనంగా ఆధ్యాత్మిక శోభ తోడైంది. అదేంటి అంటే.. నేడు భోగి పండుగ రోజునే షట్తిల ఏకాదశి తిథి కూడా రావడమే దీనికి ప్రధాన కారణం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం…
Ambati Rambabu Bhogi Dance: తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ( జనవరి 14న) వేకువ జామున ఆయన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి.
2026 సంక్రాంతి శోభతో గోదావరి జిల్లాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లె వాతావరణంలో రంగు ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాటాల మధ్య భోగి వేడుకలు సంబరాన్ని తాకుతున్నాయి. పండుగ వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను గోదావరి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. విజయవాడలో భోగి పండుగ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక పల్లె వాతావరణాన్ని తలపించేలా…
Bhogi 2026: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు భోగి పండుగతోనే ప్రారంభమవుతాయి. ధనుర్మాసం ముగింపుకు గుర్తుగా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు వచ్చే ఈ పండుగకు ఆధ్యాత్మికంగా , శాస్త్రీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2026 సంవత్సరంలో భోగి పండుగ కొత్త ఆశలను, ఆనందాలను మోసుకొస్తోంది. భోగి అంటే కేవలం మంటలు వేయడం మాత్రమే కాదు.. మనలో ఉన్న పాత ఆలోచనలను, నెగటివిటీని (ప్రతికూలతను) వదిలించుకుని, కొత్త వెలుగులోకి అడుగుపెట్టే ఒక గొప్ప సందర్భం. ఈ…
Bhogi Festival: తెలుగు పండుగల్లో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు.. మూడు రోజుల పాటు సాగే ఈ మహాపండుగలో తొలి రోజు భోగి పండుగ.. రెండో రోజు సంక్రాంతి.. మూడో రోజు కనుక జరుపుకుంటారు.. ఆ తర్వాత ముకనుమ అని కూడా నిర్వహిస్తారు.. అయితే, పాతదాన్ని విడిచిపెట్టి.. కొత్తదాన్ని ఆహ్వానించే సందేశంతో భోగి జరుపుకుంటారు. ఈ రోజున జరిగే ఆచారాల్లో అత్యంత ఆకర్షణీయమైనది, భావోద్వేగంతో నిండినది భోగి పండ్లు పోయడం. భోగి పండుగ ప్రాముఖ్యత…
Bhogi Festival: తెలుగు ప్రజలు జరుపుకొనే అతి పెద్ద పండుగ సంక్రాంతి.. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులు ఈ పండుగను నాలుగు రోజుల పాటు చేసుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిగా జరుపుతారు.
Kotakonda Festival: పచ్చని పంట పొలాల నడుమ కోటకొండలోని గుట్టపై వెలసిన వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. వీరభద్రస్వామి చేతిలో కత్తి, రక్తపు కిరీటం, కోరమీసాలతో వచ్చే భక్తులకు దర్శనమిస్తున్నాడు.
విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో మహాసంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్యర్యంలో నాలుగు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి.
కామారెడ్డి జిల్లా మళ్లీ వేడక్కనుంది. ఇవాళ మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం నిర్వహించనుంది. పాత రాజం పేట పోచమ్మ ఆలయం వద్ద విలీన గ్రామల రైతులు సమావేశం కానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఇంటింటా బోగి మంటలు వేసి కొత్తపనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే భోగి రోజు కామారెడ్డిలో రైతన్నలు భగ్గు మన్నారు.