పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. త్రివిక్రమ్ రాసిన స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తమన్ సంగీతం సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను చిత్రబృందం మొత్తం ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా పవన్ తన స్నేహితులకు, సన్నిహితులకు పార్టీ ఇవ్వగా, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తమన్ కల నెరవేరింది అంటూ ఓ స్పెషల్ పిక్ ను షేర్ చేశారు.
Read Also : Bheemla Nayak : ట్యాలెంటెడ్ బ్యూటీ డీప్ గా హర్ట్ అయినట్టుందిగా !?
‘భీమ్లా నాయక్’ కోసం తన బెస్ట్ ఇచ్చిన తమన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సంయుక్త మీనన్, రాధా కృష్ణతో కలిసి ఉన్న ఒక అందమైన చిత్రాన్ని పంచుకున్నారు. సంచలనాత్మక సంగీత దర్శకుడు “నా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఈ రోజు జరిగింది” అంటూ ఆ పిక్ కు క్యాప్షన్ ఇచ్చారు. వీరంతా నిన్న రాత్రి ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో వీక్షించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే భారీ వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది.