సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం “హరి హర వీరమల్లు”. ప్రస్తుతం పవన్, క్రిష్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే క్రిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేక ఫోటోను పంచుకున్నారు. ఆ స్పెషల్ ఏంటంటే… సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఫుల్ ఖుషీ అయిన పవన్ కళ్యాణ్ చిత్రబృందంతో పాటు తన సన్నిహితులు, స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
Read Also : భీమవరం బుల్లోడు … సునీల్!
అందులో క్రిష్ కూడా పాల్గొన్నాడు. ఆ సందర్భంలో పవన్ తో పాటు దిగిన ఫోటోను క్రిష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇక పిక్ లో దర్శకులు హరీష్ శంకర్, వేణు శ్రీరామ్, సాగర్ కె చంద్ర, త్రివిక్రమ్, క్రిష్ ఉన్నారు. ఈ స్టార్ డైరెక్టర్స్ అంతా పవన్ తో సినిమాలు చేసి, చేస్తున్న వాళ్ళే కావడం విశేషం. మరో పిక్ లో ‘హరి హర వీరమల్లు’ టీం ఉన్నారు. పార్టీ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో కలిసి దర్శకుడు క్రిష్, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఫోటో దిగారు. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ‘భీమ్లా నాయక్’ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.