పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు రాజకీయాల కోసం సినిమాలను వదిలేసిన పవన్.. మూడేళ్ళ తరువాత మనసు మార్చుకొని సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ ఎక్కువగా రీమేక్ లపై మనసుపెట్టడం అభిమానులకు నచ్చడంలేదట.. మొదటి నుంచి పవన్ రీమేక్ లపైనే కన్నేస్తూ వచ్చాడు. అదునులో కొన్ని హిట్ ని అందుకున్నాయి.. మరికొన్న డిజాస్టర్లుగా నిలిచిపోయాయి. ఇక రీ ఎంట్రీలో పవన్ ఒప్పుకున్నా సినిమాలు అన్ని రీమేక్ లే.. వకీల్ సాబ్, పింక్ రీమేక్ కాగా.. భీమ్లా నాయక్.. అయ్యప్పన్ కోషియం రీమేక్… ప్రస్తుతం విజయ ఢంకా మోగిస్తున్న ఈ సినిమా కొంతమంది అభిమానులను నిరాశపరించిందనే చెప్పాలి.
ఇక దీంతో పవన్ ని రీమేక్ లు తీయొద్దని పవన్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్- సాయి ధరమ్ తేజ్ మరో రీమేక్ లో నటిస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్న సంగతి తెల్సిందే.. ఈ వార్తలు విన్న పవన్ ఫ్యాన్స్ విసుగెత్తిపోయి.. అన్నా దండం పెడతాం.. రీమేక్ ల జోలికి పోవద్దు అన్నా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. ప్రస్తుతం ఈ చర్చ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇప్పటికే ఈ రీమేక్ కన్ఫర్మ్ అయ్యిందని, ఈ ఏడాది ఉగాది శుభ సందర్భంగా లాంచ్ కానుందని సమాచారం. మరి ఈ రీమేక్ ల పర్వాన్ని పవన్ ఎప్పుడు వీడతాడో.. అభిమానుల బాధ ఎప్పుడు తీరుతుందో అని మిగతా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారట..