పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ హిట్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అదే జోష్ తో ఆయన నెక్స్ట్ సినిమాలను పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం సమ్మర్‌లో సెట్స్ పైకి రానుంది అనే విషయాన్ని ప్రకటించారు. ఇక ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమా పూర్తవ్వడం, హిట్ అవ్వడంతో అందరి దృష్టి “భవదీయుడు భగత్ సింగ్”పై పడింది. అయితే తాజాగా యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ పోస్ట్ ను షేర్ చేస్తూ గుర్తు పెట్టుకోండి… టైం వచ్చినప్పుడు చెప్తా… అని మెగా అభిమానులను ఊరిస్తున్నాడు. ఆ పిక్ లో ఆయన పవన్ తో కలిసి ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read Also : Radhe Shyam Trailer : డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్… తప్పు ఎక్కడ జరిగిందంటే ?
హరీష్ శంకర్ “భీమ్లా నాయక్” సెట్స్ లోని ఒక చిత్రాన్ని పంచుకున్నారు. దానికి “అబ్బాయిలు ఈ చిత్రాన్ని గుర్తుంచుకోండి. సమయం దొరికినప్పుడు ఈ ఉత్తేజకరమైన సంభాషణను పంచుకుంటాను” అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులను సస్పెన్స్ లో పెట్టేశాడు హరీష్. ఇక సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న “భవదీయుడు భగత్ సింగ్” సినిమాలో పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ ఎలా చూపిస్తాడో చూడాలి.