పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్.. ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. శివరాత్రికి సాలిడ్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఆరోరోజు కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. నైజాం లో అయితే భీమ్లా నాయక్ మంచి రన్ నే హోల్డ్ చేసాడని చెప్పాలి.
ఇకపోతే ఈ సినిమా ఓటిటీ ఎంట్రీ ఎప్పుడు అనేది ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా వారు భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి ఎండింగ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఈ చిత్రం 40 రోజుల వరకు ఓటిటీ ఎంట్రీ ఇవ్వకూడదని మేకర్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే. అందుకే మార్చి నెలాఖరులో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారట. భీమ్లా నాయక్ ని థియేటర్లలో మిస్ అయినవారు.. మళ్లీ మళ్లీ చూడాలకునేవారు ఈ నెలాఖరున ఓటిటీలోకి వచ్చేవరకు ఆగక తప్పదు.