పవన్ కళ్యాణ్, రానాతో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ నుంచి ఐశ్వర్యా రాజేశ్ తప్పుకుందట. ఇందులో ఐశ్వర్య రానాకి భార్య పాత్రలో నటించవలసి ఉంది. అయితే డేట్స్ సమస్య వల్ల తప్పుకున్నట్లు ప్రచారంలో ఉన్నప్పటికీ నిజానికి పవన్ భార్య పాత్రలో నటిస్తున్న నిత్యామీనన్ తో పోలిస్తే తన పాత్ర పరిధి చాలా తక్కువగా ఉన్నందువల్లే ఐశ్వర్య డ్రాప్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. తమిళంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్ ఇటీవల కాలంలో తెలుగులోనూ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య సినిమాల గురించే కాకుండా పలు సామాజిక అంశాలు కూడా చర్చకు వస్తాయి. తాజాగా ఈ స్నేహితులిద్దరూ కలిసి తెలంగాణ విమోచన దినోత్సవం రోజున లెజెండరీ కవి రచయిత శ్రీశ్రీ గురించి చర్చించారు. ఆయన ఒక ఎత్తైన పర్వతం లాంటి వారని, ఆయన ముందు మనమంతా గులకరాళ్ళమని అన్నారు. శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న ‘మహా ప్రస్థానం’ ప్రత్యేక స్మరణికను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పవన్ & టైటిల్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రాగా, విడుదలైన మొదటి పాట కూడా రికార్డ్స్ సాధించింది. ఇక అందరు రానా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఆయనకు సంబందించిన అప్డేట్ ప్రకటించింది చిత్రబృందం. ‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. “భీమ్లా నాయక్” సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా…
టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ చివర్లో రానా పాత్రను డేనియల్ శేఖర్ అంటూ భీమ్లా నాయక్ కోపంగా అరవడం చూపించారు. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ “భీమ్లా నాయక్” ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.ఈ…
’12 మెట్ల కిన్నెర ‘కళాకారుడు కిన్నెర మొగులయ్య ఇటీవల విడుదలైన “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ లో తన గాత్రదానంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాటతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య పేరు “భీమ్లా నాయక్” సాంగ్ తో ఒక్కసారిగా మార్మోగింది. ఈ పాటలో కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఆయన కన్పించాడు. ఆయనకు తాజాగా పవన్ కళ్యాణ్ నుండి భారీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట విశేష ఆదరణ పొందింది. ఈ పాటతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఈ పాటలో కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఆయన కనిపిస్తాడు. ఆడాగాదు ఈడాగాదు… అమీరోళ్ల మేడాగాదుగుర్రం నీళ్ల గుట్టాకాడ… అలుగూ వాగు తాండాలోనబెమ్మా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ నిన్న బయటకు వచ్చింది. పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో లైక్‌లను నమోదు చేసింది. థమన్ స్వరకల్పన, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పవన్ పాత్ర హీరోయిజాన్ని సాంగ్ ద్వారా మరింత పెంచాయి. “ఇరగదీసే ఈడి ఫైర్…
పవన్ బర్త్ డే వేడుకలను మరింత ప్రత్యేకం చేయడానికి ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి వంతు వచ్చింది. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సురేందర్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో “యథా కాలమ్ తథా వ్యవహారమ్…” అంటూ ఒక గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్,…