టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ చివర్లో రానా పాత్రను డేనియల్ శేఖర్ అంటూ భీమ్లా నాయక్ కోపంగా అరవడం చూపించారు. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ “భీమ్లా నాయక్” ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.ఈ సినిమా నుంచి రానా టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. “భీమ్లా నాయక్” టీజర్లో పవన్ ను మాత్రమే చూపించడంతో నెటిజన్లు మేకర్స్ పై ఫైర్ అయ్యారు. మల్టీస్టారర్ సినిమాను పవన్ సినిమా చేసేశారు అంటూ విమర్శించారు. దీంతో మేకర్స్ రానా కోసం కూడా ఓ ప్రత్యేక టీజర్ రెడీ అవుతోందని చెప్పి విమర్శకులను కూల్ చేశారు. తాజా సమాచారం ప్రకారం డేనియల్ శేఖర్ టీజర్ కు ముహూర్తం ఖరారు అయ్యిందట.
Read Also : పేద కుటుంబానికి ప్రకాష్ రాజ్ సర్ప్రైజ్ గిఫ్ట్
తాజా బజ్ ప్రకారం సెప్టెంబర్ 17 న డేనియల్ శేఖర్‌గా రానాను పరిచయం చేస్తూ టీజర్‌ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. “భీమ్లా నాయక్” సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.