విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఉన్న లోక కళ్యాణార్ధమై శ్రీ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుండి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు కొనసాగనున్నాయి.
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి. ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 25 నుంచి 29 వరకు భవానీ దీక్షల విరమణ ఉండటంతో ఏర్పాట్లను మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ నివాస్, ఇంద్రకీలాద్రి దేవాలయ ఛైర్మన్, ఈవోలతో కలిసి పరిశీలించారు. దీక్షల విరమణ, గిరి ప్రదక్షిణ, కేశ ఖండనశాల, దర్శనం, ప్రసాదం పంపిణీ, అన్న ప్రసాదం వంటి ఏర్పాట్లపై ఆరా తీసిన…