తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)ను ఇవాళ ప్రారంభించారు.. ముదిగొండ మండలం యడవల్లిలో యాత్ర ప్రారంభమైంది.. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఖమ్మం జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభించిన యడవెల్లి జన ఉప్పెనగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర…
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఈసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నియోజకవర్గ సమస్యలను దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్రను చేపట్టనున్నారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇంకా నియోజకవర్గంలో తన…
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రధాని మోడీ అక్కసుతో మాట్లాడారు. అనేక ఇబ్బందులు తట్టుకుని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మోడీ అలా మాట్లాడుతుంటే.. కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా వున్నారు. ప్రతీ ఓటు ఇంపార్టెంట్ అనుకునే సమయంలో కూడా కేసీఆర్ పార్లమెంట్ కి పోలేదన్నారు. మోడీ..దేశ ప్రధానిగా కాకుండా అక్కసుతో మాట్లాడారన్నారు. తెలంగాణపై మోడీకి ఉన్న అక్కసు ఈ మాటలతో బయటపడిందన్నారు భట్టి. బిల్లు పాస్ చేసేటప్పుడు..…
మహిళను బానిస లాగా చూస్తున్నప్పుడు.. వారికి హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ ది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. . ఆస్తిలో హక్కులు కల్పించి లింగ వివక్ష లేకుండా చేసింది రాజ్యాంగము అని, రాజ్యాంగము మార్చడానికి నువ్వెవడు అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలని అనుకుంటున్నావు కేసీఆర్, అందరికీ సమాన హక్కులు..వాక్ స్వతంత్రం.. భావ స్వేచ్ఛ కల్పించినందుకు మార్చాలని అనుకుంటున్నావా..? అని ఆయన ఆరోపించారు. మోడీ పర్యటన.. అంతా రామానుజ చార్యుల…
సమానత్వం కోరే వారందరూ రామానుజల వారి విగ్రహాన్ని సందర్శించాలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామనుజ విగ్రహ ఏర్పాటు అద్భుతం జరుగుతున్నట్లు కనిపిస్తుందన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల కిందట .. ఒక మహానుభావుడు.. సమాజంలో వెనకబడిన వర్గాల కోసం ఆవేదన చెంది.. వాటికి వ్యతిరేకంగా రివోల్ట్ చేసిన మహానుభావుడు రామానుజల వారని కొనియాడారు. రామనుజుల వారి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన ఇచ్చిన…
ఉద్యోగ బదీలీలపై కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారటీఆర్ఎస్, బీజేపీ పై మండిపడ్డారు. జీఓ 317తో స్థానికత అనేదానికి న్యాయం లేకుండా పోయిందన్నారు. స్థానికత కోసం తెచ్చుకున్న తెలంగాణలో నేడు గందరగోళం సృష్టించారన్నారు. స్థానికత పై రాష్ట్రం పంపిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమీక్ష కోరలేదని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రపతికి పంపి ఆమోదం వేయించింది మీరు అంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు బండి…
మాజీ ఎంపీ మధుయాష్కీ ఎన్టీవీ ఫేస్ టు ఫేస్లో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రజల్లో నమ్మకం కుదిరించలేకపోతున్నాం. వందల కోట్లు వున్న నేతలు వాళ్ళు వేసే ఎంగిలిమెతుకుల కోసం పార్టీకి ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయింది. రేవంత్ రెడ్డి వచ్చాక రెడ్డి సామాజిక వర్గం వస్తుందని భావించాం. కానీ ఆందోళనకర రీతిలో హుజురాబాద్లో 3వేలకు ఓట్లు పడిపోవడం దారుణం. దీని వల్ల పార్టీలో మనోస్థైర్యం తగ్గింది. క్షణికానందం కోసం కాంగ్రెస్ నేతలు…
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై ఆయన స్పందించారు. 317జీవో తెచ్చి ఉద్యోగులను గందరగోళానికి గురిచేశారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కనీసం ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించకుండా జీవో ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఖాళీలను నింపి ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని సూచించారు. Read Also: ఎల్బీనగర్ లోటస్ ఆస్పత్రిలో దారుణం ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని…
కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఎజెండా వారిది కాదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజల అజెండానే మా ఎజెండా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు వరి ధాన్యం సమస్య రాలేదు. ఎంతో కష్టపడి తెగుళ్ళతో పోరాడి పంట పండిస్తే వరి ధాన్యం కొనుగోలు చేయమంటే రైతులు ఏం చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆడుతున్న నాటకంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల కోసమే మేం ప్రయత్నిస్తున్నాం. నేతలు ఎక్కడికక్కడ రైతులకు భరోసా ఇస్తున్నాం. చేసే…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు నడుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో రాహుల్ వర్గం, సోనియా వర్గంగా నేతలు ఉంటారు తప్ప స్థానిక నేతలకు వర్గాలు ఉండవన్నారు. పార్టీలో వర్గాలు ఉన్నాయని ఎవరైనా అలా ఊహించుకుంటే వాళ్ల పొరపాటేనన్నారు. అయితే వ్యక్తులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయని…. భావ వ్యక్తీకరణ అనేది మన…