సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర మళ్లీ మొదలుకాబోతోంది. చిన్ని బ్రేక్ తర్వాత… మళ్లీ పాదయాత్రకు సిద్ధమయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరుతో మొదలైన ఆయన పాదయాత్ర… తిరిగి కొనసాగనుంది. ఫిబ్రవరి 27న ముదిగొండ మండలం యడవల్లి నుంచి ప్రారంభమైన భట్టి పాదయాత్ర… ఈ నెల 5న గంధసిరి గ్రామం వరకు కొనసాగింది. సుమారు 102 కిలోమీటర్ల మేర నడిచారు భట్టి. అసెంబ్లీ సమావేశాల కారణంగా యాత్రకు బ్రేక్ వేశారు. సభ…
కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత భట్టి విక్రమార్క రేపటినుంచి మళ్లీ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా నిలిచి పోయిన పాదయాత్ర కొనసాగించనున్నారు. నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునేందుకు, అదేవిధంగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వచ్చేందుకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మార్చ్ పేరిట గత నెల 27న ముదిగొండ మండలం యడవెల్లిలో పాదయాత్రను చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల వల్ల 102 కిలోమీటర్ల దూరం కొనసాగిన యాత్ర గంధసిరి వద్ద…
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వివిధ ఉద్యోగాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్ యూ ఐ ఆందోళనలకు దిగింది. ఈ డిమాండ్ తోనే టీఎస్పీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు ఎన్ ఎస్ యుఐ కార్యకర్తలు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్ ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్…
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ కూడా ఇప్పుడు చేజారిపోయింది. ముఖ్యంగా పంజాబ్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ అంశంపై తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన అభిప్రాయాలు వెల్లడించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వైఫల్యమే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో దెబ్బతీసిందన్నారు. అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి ఈ…
కాంగ్రెస్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అడుగడుగునా అడ్డంకులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అయితే సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు చేదు అనుభవం ఎదురైందని, తనను అవమానించేవాడు కాంగ్రెస్లో ఎవడూ లేడని అన్నారు. అంతేకాకుండా మెదక్ జిల్లాకు వెళితే పీసీసీ సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ పద్ధతి తనకు నచ్చడం లేదని, ఈ…
రాజ్యంగాన్ని అవమాన పరుస్తున్న ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో భారత దేశంలో వ్యవస్థలు కొనసాగుతున్నాయని ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ర్ట శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ సందర్బంగా గవర్నర్ మాట్లాడే అంశాన్ని పూర్తిగా రద్దు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగాన్ని అవమాన పరచడమే అన్నారు. దేశంలో,…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్స్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రభుత్వంపై ఆయన మండిపడుతున్నారు. ప్రజల మధ్యే తిరుగుతూ వారి బాగోగులు విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు జీవోలను సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసిఆర్ వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. కానీ నకిలీ విత్తనాలు బాగా మార్కెట్ లోకి వస్తే కేసీఆర్ ఏం చేశాడని భట్టి అన్నారు. గతంలో…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. 32 రోజుల పాటు, 506 కిలోమీటర్ల దూరం పాద యాత్ర చేస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పేరిట ఈ పాద యాత్ర ప్రారంభం అయ్యింది.మొదటి రోజు పాదయాత్ర ను ముదిగొండ మండలం యడవెల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి శ్రీకారం చుట్టారు. కుటుంబ సమేతంగా దేవాలయంలో పూజలు చేసి అనంతరం యాత్రను చేపట్టారు. యడవెల్లి, మాధాపురం, కట్టకూర్, మేడేపల్లి, యడవెల్లి…
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)ను ఇవాళ ప్రారంభించారు.. ముదిగొండ మండలం యడవల్లిలో యాత్ర ప్రారంభమైంది.. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఖమ్మం జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభించిన యడవెల్లి జన ఉప్పెనగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర…
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఈసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో సైకిల్ ర్యాలీలు,మోటార్ బైక్ ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలను నిర్వహించిన భట్టి విక్రమార్క ఈసారి ఏకంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి మధిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ యాత్ర సాగనుంది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నియోజకవర్గ సమస్యలను దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్రను చేపట్టనున్నారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇంకా నియోజకవర్గంలో తన…