CLP Leader Bhatti Vikramarka fired on Komatireddy Rajgopal Reddy.
తెలంగాణ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి… విపత్తుల అంచనా వేయడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా.. ప్రభుత్వం దాట వేత ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. సీఎల్పీ బృందం వరద ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించామని, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపటి నుండి 15 వరకు 75 కిమీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో పుట్టిన నేషనల్ హెరాల్డ్ పేపర్ ను కూడా లేకుండా చేయాలని బీజేపీ చూస్తుందన భట్టి విక్రమార్క విమర్శించారు. 16వ తేదీ నుండి భద్రాచలం నుండి సిఎల్పీ బృందం వరద ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఆయన పేర్కొ్న్నారు.
16 భద్రాచలం, 17 కాళేశ్వరం లో పర్యటన సాగుతోందని, పోలవరం హైట్ వల్లనే భద్రాచలం ముంపు అని చర్చ నిర్వహించనున్నట్లు.. పోలవరం కూడా వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా దురదృష్ట కరమని, అయన ఎంపీగా..ఎమ్మెల్యే ..ఎమ్మెల్సీగా పోటీ చేసింది కాంగ్రెస్ సింబల్ మీదనే అని గుర్తు చేశారు. బీజేపీలో చేరడం ఖండిస్తున్నానన్నారు భట్టి. కాంగ్రెస్ మీద కుట్ర జరుగుతుందని, సోషల్ మీడియా లో తప్పుడు వార్తలు రాస్తున్నారని, కాంగ్రెస్ నీ నిలబెట్టింది మేమేనని, నిలబెట్టే నాయకుల మీద తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు.మునుగోడు ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేలము వెళ్లి పని చేస్తామన్నారు.