రేపు విడుదల చేయబోయే మేనిఫెస్టోలో మరిన్ని కీలకాంశాలు ఉండబోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన డిక్లరేషన్లకు అనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణ ఆదాయం పెంపు.. పెరిగిన సంపద ద్వారా పేదలకు సంక్షేమం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడిని ఖండించారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ వేయడానికి మధిర రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తుల, అభిమానులతో కలిసి ఆయన వెళ్లి నామినేషన్ వేశారు
తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం లోని ధనియాల గూడెం వద్ద భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పారని, అవకతవకల కాళేశ్వరం గురించి ముందే చెప్పానని ఆయన వెల్లడించారు. breaking news, latest news, telugu news, big news, bhatti vikramarka,
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. నెల రోజులు కొట్లాడి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చుకుందాం.. సూసైడ్ నోట్ పై విచారణ జరిపించాలి.. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. ముఖ్యమంత్రి, కొడుకు ,కూతురు , అల్లుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.