Bhatti Vikramarka : మధిరలో కాంగ్రెస్ జోరు ముందు బేజారవుతున్న కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ సునామీగా వస్తున్నదని, 78 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తదనీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ ప్రభుత్వ ఏర్పాటులో మధిర దశా దిశ నిర్దేశించేదిగా ఉండటానికి తనను నాలుగోసారి ఎమ్మెల్యేగా దీవించాలని కోటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మధిర పట్టణంలోని నందిగామ, కళామందిర్ Road, మెయిన్ రోడ్డు, రాయపట్నం సెంటర్లో ని షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించారు. ప్రతి దుకాణం యజమాని, కస్టమర్లు మరియు బాటసారులను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్ లో రోడ్డు పక్కన ఉన్న స్ట్రీట్ వెండర్స్ వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలు అడిగి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతకు ముందు ఉదయం మధిర చెరువు కట్టపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మార్నింగ్ వాక్ ప్రచారం చేశారు.

Also Read
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్న్యూస్.. ఎల్బీనగర్–హయత్నగర్ డబుల్ డెక్కర్ కారిడార్కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
మార్నింగ్ వాకర్స్, స్విమ్మర్స్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు భట్టి విక్రమార్క గారికి పూలమాలవేసి శాలువా కప్పి ఆయన చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంపద ప్రజలకు పంచాలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేయించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. మధిర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, మధిరలో చెరువులను టూరిజం హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు మత్స్య అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా మధిరను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రానున్న ఐదేళ్లు పనిచేస్తానని చెప్పారు.

మధిరకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి మాస్టర్ ప్రణాళికను రూపొందించానని, మధిరను సుందరమైన పట్టణంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. పత్తి, మిర్చి, వరి, పసుపు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. మధిర బిడ్డగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల గౌరవాన్ని పెంచానే తప్ప ఎక్కడ తగ్గించలేదన్నారు. మధిర ప్రజల బలం, ఓటర్ల ఆశీర్వాదం వల్లనే సీఎల్పీ లీడర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణలో పీపుల్స్ ప్రభుత్వం రావాలని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని చెప్పారు.

ఓటు వేసిన మధిర ప్రజలు తలదించుకునేలా చిల్లర మల్లర రాజకీయాలు ఎన్నడు తాను చేయలేదని, మధిర ప్రజలు తల ఎత్తుకొని చూసేలా, నిత్యం పతాక శీర్షికలో ఉండే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా చట్ట సభలో ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం మెడలు వంచి ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేసినట్లు వివరించారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!