రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి పండుగను రాష్ట్ర ప్రజలు సోమవారం కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హోలి పండుగ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలన్న సందేశాన్ని ఇస్తుందన్నారు. ఈ రంగుల వసంతోత్సవం ప్రజల్లో కొత్త…
నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిలు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ఒకేరోజు రెండుసార్లు సాంకేతిక లోపంతో నిలిచి పోయింది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ వట్టిమాటలు చెబుతున్నదన్న నేతలకు మా పథకాలే సమాధానమని వ్యాఖ్యానించారు.
సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో పాలు పలువురు మంత్రులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే.. అయితే, పూజలో కూర్చున్న సందర్భంగా రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పెద్ద పీటలపై కూర్చోగా... డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిన్న పీటపై కూర్చున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. దళిత నేతకు దేవుడి సమక్షంలో తీవ్ర అవమానం జరిగిందంటూ కామెంట్స్ చేశారు. ఈ అంశంపై…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బుటకపు వాగ్దానాలు చేసి తెలంగాణా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం చేసి కేసీఆర్ ను బొంద తీసి పెట్టారని విమర్శించారు.…
సీతారామచంద్ర సన్నిధిలో ఇళ్ల కార్యక్రమానికి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు భద్రాచలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అర్హులైన అందరికీ ఇళ్లు రాబోతున్నాయని తెలిపారు. గత పదేళ్ల కాలంలో పేద వాళ్లకు ఇళ్లు ఇచ్చిన పాపం లేదని అన్నారు. పోరాటం చేస్తామనే వారికి సవాల్ చేస్తున్నాం.. విమర్శలు చేసే మీ మెప్పు కోసం ఈ హామీలు ప్రకటించలేదని భట్టి…
కాకర్ల ట్రస్ట్ సేవలు గుర్తించి టీడీపీ అధిష్టానం టికెట్.. పురిటి గడ్డపై మమకారంతో మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో.. ప్రజల జీవితాలు మార్చాలన్న ఆలోచనతో ఉదయగిరి నియోజకవర్గంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా 16 పథకాలను సొంత నిధులతో ప్రజల్లోకి తీసుకువెళ్లి వేలాదిమందికి లబ్ధి చేకూర్చిన ఘనత ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు దక్కింది. ట్రస్ట్ సేవలు సూపర్ సక్సెస్…
రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఇవ్వనటువంటి విద్యుత్ నీ రాష్ట్ర ప్రజలకు అందించామని, రాష్ట్రంలో నిన్న విద్యుత్ 15623 మెగావాట్ల వినియోగం అయ్యిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 15497 మెగావాట్ల విద్యుత్ (30.03.2023న) నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ సరఫరా చేశామని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ విద్యుత్ సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. గత పాలకులు వాస్తవాలు పక్కన…