హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు హాజరయ్యారు. వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో కె.కేశవరావు ఆత్మీయంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కౌగిలించుకోవడం అక్కడ ఉన్న పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజురాబాద్ నుంచి మళ్లీ పోటీ…
తెలంగాణలో కమలం పార్టీ తన బలాన్ని క్రమంగా పెంచుకుంటోంది. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటికే పలువురు కాషాయ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. Read Also: బీజేపీలోకి తెలంగాణ ఉద్యమ నేత…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని అబద్ధాలు ఆడరని ఆమె మండిపడ్డారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన భాష మార్చుకోకుంటే ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. Read Also: వడ్ల…
ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించే దిశా కమిటీలో తనకు స్థానం కల్పించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. దిశా కమిటీలో ‘ప్రముఖ సభ్యుడు’ (ఎమినెంట్ మెంబర్)గా తనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నియమించిందని, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఈ కమిటీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు సరిగ్గా జరిగే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల సహాయార్థం జోలె పట్టి విరాళాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. వరద ప్రభావిత జిల్లాలలో బాధితులను ఆదుకునేందుకు ఈనెల 25, 26 తేదీల్లో విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలను సేకరిస్తామని, ప్రజలు నగదు, వస్తు రూపంలో విరాళాలను అందజేయవచ్చని…
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడం కోసమే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్ చెప్పారని.. ఈ మాట జగన్ అన్నారో లేదో వైసీపీ నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు పెట్టేందుకు అసలు ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా…
ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వీళ్లు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కావలి వద్ద అమరావతి రైతుల ఆధ్వర్యంలో బీజేపీ నేతలు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో దీక్ష చేస్తే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తున్నాడని.. తాము రైతుల కోసం ఆలోచిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. Read Also:…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. వరి ధాన్యం మాత్రం కొంటామని.. అయితే ఎప్పుడు కొంటాం.. ఎంత కొంటామో తరువాత చెప్తామని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ నుంచి వరి ధాన్యం కొంటున్నట్టుగా తెలంగాణ నుంచి ఎందుకు కొనుగోలు చేయడంలేదని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. పంజాబ్ కు ఒక…
దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత రావడంతో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని వాటిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. రైతు చట్టాల ఉపసంహరణలో ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారని పవన్ కొనియాడారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోయాయని మోదీ గ్రహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గురునానక్ జయంతి…