అయోధ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఆయన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా హిందూత్వాన్ని ర్యాడికల్ ఇస్లాంతో పోల్చడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు సల్మాన్ ఖుర్షీద్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు నైనిటాల్‌లోని సల్మాన్ ఖుర్షీద్ నివాసానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఆయన ఇంటి అద్దాలు పగులగొట్టి, తలుపులకు నిప్పుపెట్టారు. అయితే దుండగులు తన ఇంటిపై దాడి చేసిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ నేత…
దేశంలో వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలలో జరిగే ఎన్నికలపై ఇప్పటి నుంచి కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మరోసారి బీజేపీనే అధికారం చేపట్టనుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. అయితే గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి సీట్లు తక్కువగా వస్తాయని సర్వే వెల్లడించింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా… 2017 ఎన్నికల్లో బీజేపీ 325…
తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ జోష్ మీద ఉంది. దీంతో భవిష్యత్ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గద్దె దింపేందుకు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. ఇదే అంశంపై చర్చించేందుకు డీకే అరుణ నివాసంలో బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, హుజూరాబాద్ నుంచి ఇటీవల విజయం సాధించిన ఈటల…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జి మురళీధర్‌రావు బ్రాహ్మణులు, బనియాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భోపాల్‌లో ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఆయన నోరుజారారు. బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులోని వ్యక్తులు అంటూ వ్యాఖ్యానించారు. ఈ రెండు సామాజిక వర్గాల నుంచి ఎక్కువ మంది ప్రజలు బీజేపీలో ఉంటే మీడియా కూడా తమ పార్టీని బ్రాహ్మణ, బనియా పార్టీగా పిలుస్తుందని.. అయితే బీజేపీ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును కోరుకుంటుందని మురళీధర్‌రావు పేర్కొన్నారు. Read Also:…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు. పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు విరుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తూ వస్తోందని.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తుంటే తెలంగాణలో ఎందుకు తగ్గించరని విజయశాంతి నిలదీశారు. హుజురాబాద్‌లో ఓటమి చెందడంతో కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆమె ఆరోపించారు. Read…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతారని మండిపడ్డారు. ఆదివారం రాత్రి గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ అబద్దాలే మాట్లాడారని.. ఈ అబద్దాలు చెప్పేందుకే ప్లీనరీలు, బహిరంగసభలు, కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా లేరని.. రైతులను ఆగమాగం చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వమేనని విమర్శించారు. తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎక్కడ అవుతుందో…
హర్యానాలో బీజేపీ ఎంపీలకు ఇటీవల తరచూ రైతుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మాజీ ఎంపీ మనీష్ గ్రోవర్‌ను రైతులు 8 గంటల పాటు నిర్బంధించారు. దీంతో బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ నేతను ఎవరైనా అడ్డుకుంటే వారి కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తా అంటూ హెచ్చరించారు. బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. Read Also: డీజిల్ ధర విషయంలో…
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. పెంచింది బారెడు.. తగ్గించింది చిటికెడు అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ‘మోదీజీ గత సంవత్సరంలో లీటర్ పెట్రోల్ రూ.28.28, లీటర్ డీజిల్ రూ.27.61 మేర పెరిగాయి. ఇటీవల ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.10 తగ్గించారు. దయచేసి ‘పెద్ద ఉపశమనం’ కలిగించాం అని చెప్పకండి’ అంటూ ఇండియన్ యూత్…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఎందుకంటే ఆ పార్టీకి కేసీఆర్ రూపంలో బలమైన సీఎం ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలలో బలమైన సీఎం అభ్యర్థులు లేకపోవడం వల్లే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఆ పార్టీలో చెప్పుకోవడానికి చాలా మంది సీనియర్ నేతలు, సీఎం అభ్యర్థులు ఉన్నారు కానీ ప్రజల్లో చరిష్మా ఉన్న నేత లేరనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా…
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ మరోసారి టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వారి నియోజకవర్గాల్లో పర్యటించి తీరుతానని, వారి భరతం పడతానని ఈటల వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన గెలుపు అని అభివర్ణించారు. అధికార పార్టీ నేతలు రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని ఈటల ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా… తనను గెలిపించిన…