దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఎదురుగాలి వీచింది. బీజేపీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలవగా… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా 15 స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి. దేశంలో మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం మధ్యప్రదేశ్ ఖండ్వా స్థానంలోనే బీజేపీ విజయం సాధించింది. దాద్రానగర్ హవేలీలో శివసేన, హిమాచల్ ప్రదేశ్ మండీలో కాంగ్రెస్ విజయం…
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. ఈ గెలుపుతో అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్య 3కి చేరిందని కమలం పార్టీ నేతలు పొంగిపోతున్నారు. అయితే నిజంగా హుజురాబాద్‌లో బీజేపీ గెలిచిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. సాంకేతికంగా మాత్రమే బీజేపీది గెలుపుగా భావించాలి. దీనికి కారణం ఈటల రాజేందర్. నిజానికి ఈ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య జరగలేదు. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్‌గానే సాగింది. అందుకే ఈ గెలుపును చూసి బీజేపీ…
తెలంగాణలో గత నాలుగు నెలలుగా హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ఆసక్తి రేపింది. ఎట్టకేలకు హుజురాబాద్ సమరంలో గెలుపు ఎవరిదో తెలిసిపోయింది. ప్రజలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు పట్టం కట్టారు. 22 రౌండ్ల ద్వారా కౌంటింగ్ జరగ్గా.. 23,855 ఓట్ల మెజారిటీతో ఈటల విజయకేతనం ఎగురవేశారు. రౌండ్ల వారీగా ఫలితం:మొదటి రౌండ్: బీజేపీకి 4,610 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,444 ఓట్లు-బీజేపీ మెజారిటీ 166 ఓట్లురెండో రౌండ్: బీజేపీకి 4,851 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,659 ఓట్లు-బీజేపీ మెజారిటీ…
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బద్వేల్ ఉప ఎన్నికలో చారిత్రక విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఎన్నిక తమ బాధ్యతను మరింత పెంచుతోందని సజ్జల వ్యాఖ్యానించారు. ఓడితే సమీక్షించుకోవడానికి, గెలిస్తే మరింత బాధ్యతగా పనిచేయడానికి స్ఫూర్తిని ఇస్తుందని సజ్జల తెలిపారు. Read Also: సీఎం జగన్ రికార్డును బద్దలు కొట్టిన మహిళ మరోవైపు ప్రధాన…
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఈ మూవీ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి ‘RRR’ కాకుండా బీజేపీ ‘RRR’కు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ తరఫున ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్, గత ఏడాది దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్‌రావు…
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ 30వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.5వేల కోట్లను ఖర్చు చేసిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఫలితం టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇచ్చారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. Read Also: టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ ఈటల హవా…
హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 14 రౌండ్ల ఫలితాలు పూర్తిగా కేవలం రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం చూపించారు. మిగతా 12 రౌండ్లలో ఈటల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యం కనపరిచారు. 14 రౌండ్ల ఫలితాలు ముగిసే సరికి ఈటల రాజేందర్ 9,434 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. Read Also: హుజురాబాద్ ఈటల కంచుకోట..? అయితే టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ బీజేపీ అభ్యర్థి…
బద్వేలులో ఉప ఎన్నిక సమరం ముగిసింది. ఈనెల 2న ఫలితం తేలనుంది. అయితే ఉప ఎన్నికలో గెలుపు వైసీపీకే అనుకూలంగా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తున్నా.. బరిలో నిలిచిన బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్నది కీలకంగా మారింది. ఎందుకంటే బద్వేల్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అయితే తెరచాటున బీజేపీకి టీడీపీ సాయం చేసిందని జరిగిన పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. బద్వేల్ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. పలు చోట్ల…
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని 262వ నంబర్ పోలింగ్ బూత్‌లో తన భార్య జమునతో కలిసి ఈటెల రాజేందర్ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ సరళిని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ప్రజలు తమ గుండెల్లోని బాధలను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడమే దీనికి నిదర్శనమన్నారు.…
హుజురాబాద్‌లో గాలి ఎటువైపు వీస్తుందో ఎవరికీ అంతుబట్టటం లేదు. ఓటరు నాడి పట్టుకోవటంలో పార్టీలు విఫలమయ్యాయి. నిజానికి ఈ ఎన్నికలు ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న యుద్ధంగా ఓటరు భావిస్తున్నాడు. అందుకే ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నాడు. అయితే నియోజకవర్గంలో వివిధ వర్గాల వారిని కలిసి వారితో సంభాషించినపుడు.. ఓటరు మదిలో ఏముందో కొంతైనా అర్థమవుతుంది. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినా.. కారణం ఏదైనా.. ఈటల రాజేందర్ స్థానిక నేత. ఆయనకు స్థాన బలం సహజం. మరోవైపు టీఎస్ఆర్…