కడపలో బీజేపీ రాయలసీమ రణభేరి సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని ఆరోపించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిపోయిందని.. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎన్నాళ్లు నెట్టుకొస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు…
కాంగ్రెస్ పార్టీలో ఐదు రాష్ట్రాల ఓటమి తాలూకు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల రాజీనామాకు అధిష్టానం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, జీ-23 రెబల్స్ అధిష్టానంపై గుగ్లీలు విసురుతూనే ఉన్నారు. ఇది ఇలావుంటే, రెబల్ నేతగా ముద్రపడిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అతి త్వరలో సోనియా గాంధీని కలవనున్నారు. ఈ భేటీలో రాహుల్, ప్రియాంక కూడా పాల్గొంటారని సమాచారం. జీ-23 సభ్యుల ఆఖరి ప్రతిపాదనలను ఈ సందర్భంగా సోనియాకు అందచేస్తారని తెలుస్తోంది.…
విశాఖ వేదికగా జరిగిన బీజేపీ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యంగా వైసీపీ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని.. ఏపీకి మంచి దిక్కు అవసరం అని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం కార్యకర్తల సమిష్టి కృషి అని కార్యకర్తలను విశ్వసించే పార్టీ బీజేపీ ఒక్కటేనని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో విజయం స్ఫూర్తితో ఏపీలోని బీజేపీ కార్యకర్తలు, నేతలందరూ…
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం ప్రారంభించబోతుందని తెలిపారు. బీజేపీ ఫోకస్ పెట్టే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. త్వరలోనే ఏపీ, తెలంగాణలో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని జీవీఎల్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో చాలా మంది నేతలు తమ కాంటాక్టులలోకి వస్తున్నారన్నారు. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ…
ఏపీ బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోందని ఆయన కామెంట్ చేశారు. అప్పులు పెట్టిన జగన్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. అప్పులు ఎగ్గొట్టడానికా అంటూ ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏ ప్రాంతం అభివృద్ధి గురించి ప్రస్తావనే లేదని ఆరోపించారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. మసిపూసి…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విజయం అని ఆయన అభివర్ణించారు. దేశంలో తమ పాలనకు ప్రజలు ఇచ్చిన బహుమతి అని తెలిపారు. ఈసారి హోలీ మార్చి 10నే మొదలైందని.. ఇవాళ్టి ఫలితాల్లో గొప్ప సందేశం ఉందన్నారు. ప్రజల నమ్మకం, విశ్వాసం పొందేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేశారు కాబట్టి ఇది కార్యకర్తల విజయమని మోదీ తెలిపారు. దేశంలోని నాలుగు వైపులా ప్రజలు…
అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ఈ ఫలితాలు ఉన్నాయి. అయితే పంజాబ్ లో ఆప్ ఊహించని మెజార్టీ సాధించింది. అధికార కాంగ్రెస్ దాదాపు తుడిచి పెట్టుకుపోవటం ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన విశేషం. ఇప్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక దేశ వ్యాప్త విస్తరణకు ప్రయత్నిస్తుంది. ఈ విజయంతో ఆ పార్టీకి జాతీయ హోదా కూడా దక్కుతుంది. దేశంలో…
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తున్నా ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్ ధామి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. సీఎం పుష్కర్ సింగ్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ చంద్ కప్రీ 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా ఖతిమా నియోజకవర్గంలో మొత్తం 91,325 ఓట్లు పోలవగా పుష్కర్ సింగ్…
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో బీజేపీ తిరిగి విజయ పీఠాన్ని దక్కించుకుంది. అయితే బీజేపీ సాధించిన విజయంలో ఓ తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది. అతడే సత్యకుమార్. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నేతగా మారి ప్రస్తుతం యూపీ బీజేపీ ఇంఛార్జిగా ఆయన సేవలందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి తనదైన ప్రచార వ్యూహ రచనతో యూపీలోని 403 స్థానాల్లో 135 స్థానాలకు సత్యకుమార్ చేసిన కృషి అనితర సాధ్యమని రాజకీయ విశ్లేషకులు…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తోంది. అయితే పంజాబ్లో ఆప్ ప్రభుత్వం రావడం ఖరారు కాగా గోవాలో హంగ్ ఏర్పడుతుందని ప్రస్తుత ఫలితాల సరళి చాటి చెప్తోంది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో గోవా ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ, ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు.…