ఏపీలో పాఠశాలలకు మే 6 నుంచి జూలై 3 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలవులు టీచర్లకు వర్తించవు అని.. మే 20 వరకు టీచర్లు పాఠశాలలకు రావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా స్పందించారు. టీచర్లకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీచర్లకు సెలవులు వేసవి కాలంలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా అంటూ ఎద్దేవా…
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు దేవాలయాల నిధులిస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. కొత్త జిల్లాలలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటుకు హిందూ దేవాలయాలు నుంచి నిధులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం దేవాలయాల నుంచి నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమ్మఒడి గత ఏడాది ఇవ్వలేదని.. ఈ ఏడాది…
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో అసన్సోల్ లోక్‌సభతో పాటు బాలీంగజ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. శతృఘ్నసిన్హా (తృణమూల్ కాంగ్రెస్), బాబుల్ సుప్రియో (తృణమూల్ కాంగ్రెస్) విజయం సాధించారు. అస్సనోల్ లోక్‌సభను గతంలో బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఆ స్థానం అధికార పార్టీ టీఎంసీ వశమైంది.…
హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాడిసన్ పబ్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ పేర్లన్నీ తాను వెల్లడిస్తానని.. దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో ఎవరైనా బీజేపీ నేతలు ఉంటే వారిని…
పార్లమెంట్‌లో పెద్దల సభగా పేరు పొందిన రాజ్యసభపై అధికార పార్టీ బీజేపీ పట్టు బిగిస్తోంది. చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో తన బలాన్ని బీజేపీ 100 సీట్లకు పెంచుకుంది. రాజ్యసభలో ఈ స్థాయిలో సీట్లు పొందడం బీజేపీకి ఇదే తొలిసారి. గతంలో ఒక్కసారి మాత్రమే రాజ్యసభలో ఓ పార్టీ 100 కంటే ఎక్కువ సీట్లను హస్తగతం చేసుకుంది. 1990లో కాంగ్రెస్ పార్టీ ఈ ఫీట్ సాధించింది. అప్పుడు పెద్దల సభకు ఆ పార్టీ తరఫున 108 మంది సభ్యులు…
ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపుపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి స్పందించారు. 2024లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే పెద్ద షాక్ ఇస్తారని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్థితిలో సామాన్య ప్రజలు లేరన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఏపీని అవినీతి ప్రదేశ్, అంధకారప్రదేశ్‌గా మారుస్తున్న గొప్ప వ్యక్తి జగన్ అంటూ ఏపీ బీజేపీ…
రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను ఉద్దేశిస్తూ రాజస్థాన్ మంత్రి బీజేపీ నేతలను రావణుడి భక్తులతో పోల్చారు. బీజేపీ నేతలు రాముడి భక్తులు కాదని రావణుడి భక్తులు అని మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హిందూ భక్తులు అని చెప్పుకుంటున్నారని.. కానీ వాళ్లు రాముడి…
ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తమ ప్రదర్శన చేసిన భారతీయ జనతా పార్టీ రాబోయే రెండేళ్లలో జరిగే వివిధ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమవుతోంది. ఒక దాని తరువాత ఒకటిగా నిరంతరం ఎన్నికల కోసం పనిచేయటం బీజేపీ ప్రత్యేకత. నిరంతరం గెలుపు వ్యూహాలకు పదును పెడుతూనే ఉంటుంది. ఉత్తరాదితో పాటు ఈశాన్య భారతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. కానీ దక్షిణాది విషయంలో ఆ పరిస్థితి లేదు. కర్ణాటక మినహా మిగతా నాలుగు రాష్ట్రాలో అధికారం…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. సోమవారం నాడు సభలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా బీర్బూమ్ ఘటనపై సీఎం మమత మాట్లాడాలని బీజేపీ నేతలు పట్టుబట్టడం టీఎంసీ ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇటీవల బీర్బూమ్‌లో టీఎంసీ నేత…
మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మరోసారి ప్రకటన చేయడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయగా తాజాగా బీజేపీ కూడా జగన్ ప్రకటనను తప్పుబట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాటపై సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా మడం తిప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అమరావతి రాజధానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ కట్టుబడి ఉందని ఆయన…