మా అధ్యక్షుడు, ప్రముఖ హీరో మంచు విష్ణు తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి జిన్నా అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. అయితే ఈ సినిమా టైటిల్‌పై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘జిన్నా’ అనే టైటిల్ వెంటనే తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్‌ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడాన్ని కూడా బీజేపీ తప్పుబట్టింది. ఈ మేరకు బీజేపీ ప్రధాన…
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ల ఆధారంగా ఆయన త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రాజకీయరంగ ప్రవేశం చేస్తే గంగూలీ ఖచ్చితంగా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ అంశంపై గతనెలలో రెండు సార్లు గంగూలీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మే 8న గంగూలీ ఇంట్లో అమిత్ షా విందుకు…
ప్రధాని మోదీ ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గురువారం సాయంత్రం ఆయన తమిళనాడు వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే మోదీ పర్యటనను కొంతమంది తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్ మోదీ’ అంటూ వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. దీంతో వరుసగా రెండో రోజు కూడా #GoBackModi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. PM Modi: జీ20 దేశాల్లో…
ఏపీ సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధర లేదని.. కొనుగోళ్లలో ఘరానా మోసం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అధికారులతో కుదిరిన ఒప్పందాన్ని మాత్రం దర్జాగా అమలు చేస్తూ మిల్లర్లు రైతుల నోట్లో దుమ్ము కొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనేక వేదికల మీద ఈ విషయం చెబుతోన్నా ప్రభుత్వం మొద్దు…
ఏపీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సోమవారం నాడు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు రావెల కిషోర్ బాబు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు లేఖ పంపారు. కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు రావెల కిషోర్‌బాబు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన రావెల ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. Somu Veerraju:…
రూ.2,500 కోట్లు ఇస్తే సీఎం పదవి ఇప్పిస్తామంటూ కొందరు ఆఫర్ చేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. కర్ణాటక సీఎం పదవి వేలానికి పెట్టారా.. డబ్బులిస్తే చాలు.. ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేస్తారా అంటూ ఆయన నిలదీశారు. సీఎం సీటు ఏమైనా పేమెంట్ సీటా అని ప్రశ్నించారు. బసనగౌడ వ్యాఖ్యలపై తక్షణం దర్యాప్తు జరపాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ విచారణ జరపకుంటే బసవరాజ్…
పశ్చిమ బెంగాల్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్‌షా కలయిక కారణంగా గంగూలీ బీజేపీలో చేరతారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తన ఇంటికి వచ్చిన అమిత్ షాకు గంగూలీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ తర్వాత బీజేపీ నేతల సమక్షంలోనే పలు అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఆ తర్వాత గంగూలీ ఇంట్లోనే ఆయనతో కలిసి అమిత్ షా డిన్నర్…
ఏపీలో ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అసలు పాలన ఉందా అని ఆయన ప్రశ్నించారు. రోజురోజుకు మానవత్వం మసకబారిపోతోందని.. తమవారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి చేతనైన సహాయం అందించాల్సింది పోయి అక్కడ కూడా డబ్బులు, రూల్స్ అంటూ వైద్య సిబ్బంది ప్రవర్తించడం దారుణమని సోము వీర్రాజు మండిపడ్డారు. తిరుపతిలో కాలువలో పడి మృతిచెందిన 10 సంవత్సరాల బాలుడిని ఇంటికి తీసుకెళ్లడానికి తండ్రి నానా అవస్థలు…
టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. కేవలం బీజేపీని తిట్టడానికే ఆయన టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించారన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టే కేసీఆర్ బీజేపీని తిట్టడానికి ఈ సమావేశం పెట్టుకున్నారని ఆరోపించారు. సాధారణంగా ప్లీనరీలో పార్టీ వ్యవహారాలు, సంస్థాగత ఏర్పాట్లపై చర్చిస్తారని.. కానీ టీఆర్ఎస్ ప్లీనరీ దీనికి విరుద్ధంగా జరిగిందని బండి సంజయ్ విమర్శించారు. 33 రకాల…
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సందర్భంగా ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఆస్తులను ప్రకటించిన కేసీఆర్ తన కుటుంబం ఆస్తులను ఎందుకు ప్రకటించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోజుకో మాట…