భానుప్రియ అన్న నాలుగక్షరాలు ఆ రోజుల్లో ఎందరో కుర్రాళ్ళకు నిత్యం జపించే మంత్రం. భానుప్రియ అందాల అభినయం రసిక హృదయాల్లో ఓ ఆకర్షణ యంత్రం. కనులు మూసినా, తెరచినా ఈ విశాలాక్షి రూపాన్నే స్మరిస్తూ సాగినవారెందరో. అందరికీ ఈ నాటికీ భానుప్రియ పేరు వినగానే మదిలో మధురమైన బాధ మొదలు కాక మానదు. నటనతోనూ, నర్తనంతోనూ తెలుగువారికి నయనానందం కలిగించిన అభినయ ప్రియ ఆమె. భానుప్రియ అసలు పేరు మంగభాను. స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రంగంపేట. అక్కడే…
(అక్టోబర్ 9న ‘అపూర్వ సహోదరులు’కు 35 ఏళ్ళు)నందమూరి బాలకృష్ణ నటజీవితంలో ఒకే యేడాది ఆరు వరుస విజయాలు చూడటం అన్నది మరపురాని విజయం. 1986లో ఈ విశేషం చోటు చేసుకుంది. ‘ముద్దుల క్రిష్ణయ్య’తో ఆరంభమైన ఆ ఘనవిజయం ‘అపూర్వ సహోదరులు’తో పూర్తయింది. 1986లో బాలకృష్ణ చివరి చిత్రంగా వచ్చిన ‘అపూర్వ సహోదరులు’ అక్టోబర్ 9న దసరా కానుకగా జనం ముందు నిలచింది. బాలకృష్ణ నటనాపర్వంలో తొలి ద్విపాత్రాభినయ చిత్రంగానూ ‘అపూర్వ సహోదరులు’ నిలచింది. ప్రేక్షక హృదయాలను గెలిచింది.…