భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కార్తీక మాసాన హైదరాబాద్ జంట నగర ప్రజలను ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం గురువారం ఏడోరోజుకు చేరింది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఏడోరోజు వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవం ప్రాంగణానికి తరలివచ్చారు. ఏడోరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అందజేశారు. ఏడోరోజు సందర్భంగా…
భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం ఏడోరోజుకు చేరింది. ఏడోరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో మనుషులపై పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఒక్క క్షణం కూడా తీరిక దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో తెలియని మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు.…
భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా ఆరో రోజుకు చేరింది. కార్తీక మాసాన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండువగా జరుగుతోంది. ఆరోరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈరోజు కార్యక్రమంలో ముందుగా శంఖారావం పూరించిన తర్వాత హైదరాబాద్ రామకృష్ణమఠానికి చెందిన శ్రీశితికంఠానంద స్వామి, రాజమహేంద్రవరం రామకృష్ణమఠానికి చెందిన శ్రీవినిశ్చలానంద స్వామి,…
ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 12 నుంచి 22వరకు వైభవోపేతంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. అయితే నేడు 6వ రోజు సందర్భంగా విశేషాలను తెలుసుకుందాం.. కాజీపేట గణపతి కోటి గరికార్చన, గణపతి విగ్రహాలకు గరికార్చనతో పాటు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక కళ్యాణం అనంతరం మూషిక వాహనంపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.…
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈనెల 12న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు కొనసాగనుంది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు 16 ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు…
భక్తి టీవీ కోటిదీపోత్సవం నాల్గవ రోజుకి చేరుకుంది. కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. వేలాదిమందిని భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తోంది. నాల్గవ రోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇవాళ్టి కార్యక్రమాల్లో శ్రీ ప్రకాశనందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అవధూతగిరి మహారాజ్, మహంత్ శ్రీసిద్ధేశ్వరానందగిరి మహారాజ్, బర్దీపూర్, శ్రీలలితా పీఠం శ్రీ స్వరూపానందగిరి అనుగ్రహ భాషణం వుంటుంది. అనంతరం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనామృతం వుంటుంది. వేదికపై పూజలో భాగంగా…
కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. మూడో రోజైన నేడు సింహాచలేశునికి హరిచందన పూజ, సింహాద్రి అప్పన్న కల్యాణ వైభోగం, చందనాల స్వామికి పల్లకీ ఉత్సవం, అహోబిలం శ్రీరామానుజ జీయర్ స్వామి ఆశీర్వచనం, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనామృతం లాంటి విశేషాలతో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతోంది. కాగా.. ఈ నెల 12 తేదీన సాయంత్రం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల నుంచి కోటి దీపోత్సవం…
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలోనూ భక్తి టీవీ కోటిదీపోత్సవానికి విశేష ప్రాధాన్యత వుంది. కోటి దీపోత్సవం మొదటి రోజు నిర్వహించిన మహా శివలింగానికి అభిషేకం కనుల పండువగా సాగింది. భక్తి టీవీ కోటి దీపోత్సవం నవంబర్ 12 న అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం అయింది. ఈనెల 22 వరకు కొనసాగనుంది. ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు కోటి దీపోత్సవ కాంతులు భక్తజనకోటిపై ప్రసరించనున్నాయి. ప్రతీ రోజు భక్తులు స్వయంగా విశేష…
కార్తీకం వచ్చిందంటే భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతాయి. కోటికాంతులు భక్తుల మనసులను పులకింపజేస్తాయి. ఓంకారానికి తోడు శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు దీపోత్సవానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తిటీవీ కోటిదీపోత్సవం నిర్వహిస్తోంది.. ఇవాళ్టి నుంచీ ఈ నెల 22వ తేదీ వరకు కన్నుల పండువగా ఈ కార్యక్రమం జరుగుతోంది.. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతీరోజు…