ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 12 నుంచి 22వరకు వైభవోపేతంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. అయితే నేడు 6వ రోజు సందర్భంగా విశేషాలను తెలుసుకుందాం.. కాజీపేట గణపతి కోటి గరికార్చన, గణపతి విగ్రహాలకు గరికార్చనతో పాటు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక కళ్యాణం అనంతరం మూషిక వాహనంపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ఆధ్వర్యంలో ప్రవచనామృతం కూడా ఉంది. అంతేకాకుండా లింగోద్బవ కార్యక్రమం, సప్త హారతి కన్నుల పండువగా జరుగనుంది. వీటితో పాటు భక్తకోటి వెలిగించే దీపోత్సవ వేడుక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే.. సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఆర్టీసీ తరుపున ప్రత్యేక బస్సు సౌకర్యాలు కూడా కల్పించారు. ఓ సారి దర్శిద్దాం.. తరిద్దాం..