తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలోనూ భక్తి టీవీ కోటిదీపోత్సవానికి విశేష ప్రాధాన్యత వుంది. కోటి దీపోత్సవం మొదటి రోజు నిర్వహించిన మహా శివలింగానికి అభిషేకం కనుల పండువగా సాగింది. భక్తి టీవీ కోటి దీపోత్సవం నవంబర్ 12 న అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం అయింది. ఈనెల 22 వరకు కొనసాగనుంది. ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు కోటి దీపోత్సవ కాంతులు భక్తజనకోటిపై ప్రసరించనున్నాయి. ప్రతీ రోజు భక్తులు స్వయంగా విశేష పూజలు నిర్వహించుకునే విధంగా ఈ కార్యక్రమం జరుగుతోంది.అన్ని రకాల కోవిడ్ నిబంధనలతో కోటి దీపోత్సవం నిర్వహిస్తోంది భక్తి టీవీ.