కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. మూడో రోజైన నేడు సింహాచలేశునికి హరిచందన పూజ, సింహాద్రి అప్పన్న కల్యాణ వైభోగం, చందనాల స్వామికి పల్లకీ ఉత్సవం, అహోబిలం శ్రీరామానుజ జీయర్ స్వామి ఆశీర్వచనం, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనామృతం లాంటి విశేషాలతో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతోంది. కాగా.. ఈ నెల 12 తేదీన సాయంత్రం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల నుంచి కోటి దీపోత్సవం కార్యక్రమం చాలా సందడిగా జరుగుతోంది.