కార్తీకం వచ్చిందంటే భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతాయి. కోటికాంతులు భక్తుల మనసులను పులకింపజేస్తాయి. ఓంకారానికి తోడు శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు దీపోత్సవానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తిటీవీ కోటిదీపోత్సవం నిర్వహిస్తోంది.. ఇవాళ్టి నుంచీ ఈ నెల 22వ తేదీ వరకు కన్నుల పండువగా ఈ కార్యక్రమం జరుగుతోంది.. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతీరోజు సాయంత్రం 5.30 గంటలకే ప్రారంభం అవుతుంది..
ఇక, మొదటి రోజు విశేష కార్యక్రమాల విషయానికి వస్తే.. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామీజీ, శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి.. అనుగ్రహ భాషణం… బ్రహ్మశ్రీ నోరి నారయణమూర్తి ప్రవచనామృతం ఉంటుంది.. ఇక, వేదికపై కాశీస్పటిక లింగానికి సహస్ర కలశాభిషేకం, కోటి మల్లెల అర్చన నిర్వహిస్తారు.. భక్తులచే శివలింగాలకు కోటిమల్లెల అర్చన ఉంటుంది.. కాళేశ్వరం శ్రీముక్తేశ్వర కల్యాణం కన్నుల పండుగ జరగనుండగా.. హంస వాహన సేవ నిర్వహించడం జరుగుతోంది.. కోటి దీపోత్సవాన్ని లైవ్ లో చూసేందుకు కింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి…