Monkeys Meat: కోళ్లు, మేకలను దొంగలించి వాటిని అమ్ముకోవడమో లేక వండుకుని తినే దొంగలను మనం చూసాం. ఇక మరి కొందరు కుక్కలను, మరికొన్ని జంతువులను చంపి వాటి ఎములతో కాఫీ, టీపొడులు తయారు చేసి విక్రయించిన సంఘటనలు కూడా చూసాం. అయితే.. కొందరు కోతులను చంపి తిన్నారంటే వీరు మనషులా.. లేక నరరూప రాక్షసులా అనే ఆలోచన వస్తుంది. ఈఘటనతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు కోతులు తింటే రేపు మనషులను తినేంత దుస్థితికి దిగజారుతురంటూ వీరిని వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరుతున్నారు. ఈ అమానవీయ ఘటన నిర్మల్ జిల్లా బైంసా మండలం చింతలో బోరి గ్రామంలో చోటుచేసుకుంది.
Read also: Hyderabad : భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే వీడియో తీసిన భర్త..
కొంతమంది కోతులను చంపి వాటిని వండుకుని తిన్నారు. అడవిలో నాలుగు కోతులను పట్టుకుని వాటిని చంపి వండుకుని తిన్నారు. గమనించిన గ్రామస్తులు కోతులను చంపిన వారిని పట్టుకున్నారు. కోతులను చంపి తినేస్తున్నారని ఆరోపించారు. దేవుళ్లుగా పూజించే కోతులను ఎందుకు చంపారు? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కోతులను చంపిన వారు సంచార జాతులకు చెందిన వారని తెలుస్తోంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి తిరుగుతూ జీవిస్తున్నారు. కానీ వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు వేరు. ఇలాంటి వారు చాలా మంది అడవిలో దొరికే సూక్ష్మజీవులను చంపి తింటుంటారు. వీళ్లు గ్రామాల్లో పిల్లులను కూడా పట్టుకుని చంపి తింటారు.
అదే తరహాలో కోతులను పట్టుకుని ఇలాగే వండి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే వీరి చర్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులు దేవుడితో సమానమని.. అలాంటి జీవులను చంపి తింటే ఎలా అని వాపోయారు. గ్రామ శివారులో ఉన్న తమ గుడారాల వద్దకు వెళ్లి వారిని అడ్డుకున్నారు. అప్పటికే కోతుల శరీర భాగాలను వండుకుని తినగా, ఇక.. తల, చేతులు, కాళ్లు కాల్చి వండుకునేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. అయితే.. మెుదట తాము ఒక కోతినే పట్టుకున్నామని చెప్పారు. కాగా.. గ్రామస్థులు గట్టిగా నిలదీయటంతో మెుత్తం మూడు కోతులని.. మరొకటి పిల్ల కోతని చెప్పారు. అయితే.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు.
TS Assembly Session: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 17 వరకు జరిగే అవకాశం