padayatra started on the third day: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజసంగ్రామ యాత్ర ఇవాళ ఉదయం ప్రారంభమైంది. నేడు గుండెగావ్, మహాగావ్ మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నేటితో మూడో రోజుకు చేరింది. అయితే.. బండి సంజయ్ 5వ ప్రజాసంగ్రామ యాత్ర హై కోర్టు షరతులకు అనుగుణంగానే కొనసాగుతుంది. అవకాశం ఉన్న చోటల్లా టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతూ ముందుకు సాగిపోతున్నారు. బండి సంజయ్ పాదయాత్రకు ఆర్మూర్ పట్టణ బీజేపీ నాయకులు బయలుదేరారు. ఈ యాత్ర కుబీర్ మండలం ఛాత మీదుగా సాగుతూ.. కుంటాల మండలం లింబా గ్రామంలో ముగుస్తుంది. అక్కడ బసచేసి గురువారం 4వ రోజు సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుంది.
read also: Perni Nani: వైఎస్ఆర్ మరణించడంతోనే బందరు పోర్టు నిర్మాణం ఆలస్యం
నిన్న భైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. బైంసా రావాలంటే వీసా తీసుకోవాలా..? బైంసా ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో ఉందా..? అని ప్రశ్నించారు. ఇక్కడికి రావాలంటే వీసా తీసుకుని రావాలా.. మతవిద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నాయకులు మాత్రం ఎక్కడైనా తిరుగొచ్చా..? అని ప్రశ్నించారు. హిందూ దేవతలను కించపరిచే మునావర్ ఫరూఖీ వంటి వారు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చా..? అని అడిగారు. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగిన కాషాయ జెండా రెపరెపలాడించాలని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను బండి సంజయ్ కోరారు. బైంసా గడ్డపై 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ ఇంకో ఏడాది హిందువులపై దాడులు చేయిస్తాడు.. కష్టాను భరిద్ధాం.. రాబోయేది మన ప్రభుత్వమే అని అన్నారు.
China Covid Protest: ఏమిటీ ‘ఏ4 విప్లవం’.. తెల్లకాగితం గుర్తు వెనుక రహస్యమేంటి?