Rythu Bandhu : మరో రెండు రోజుల్లో రైతు భరోసా నిధులు 90 శాతం మంది రైతుల ఖాతాల్లో జమ అవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఈరోజు మంత్రి ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలించడం జరుగుతుందని, అవి మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతుబంధు నిధులు మరో రెండు రోజుల్లో జామవుతాయని చెప్పారు. ఉగాది రోజున ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. కొత్తగూడెం పట్టణంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని కేంద్రమంత్రిని కలిసి కోరటం జరిగిందని, ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తే దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాచలం దివ్య క్షేత్రం మరింత ప్రాచుర్యం పెరుగుతుందన్నారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, ఆదిలాబాద్ మీదుగా జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. యాదాద్రి భద్రాద్రి జాతీయ రహదారి వల్ల గోదావరి పరివాహక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.
Indigo Flight: ఫ్లైట్‌లో ప్రయాణికుడు మృతి.. అత్యవసర ల్యాండింగ్